మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా , అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ” పెద్ది “. బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఫుల్ వీడియోను ఈ రోజు (నవంబర్ 7) న కొద్దీ నిమిషాల క్రితమే విడుదల చేశారు.
ఈ సాంగ్ లో పెద్ది తన ప్రేయసిని మొదటి సారి చూసినప్పుడు స్నేహితుడితో తన అనుభవం పంచుకునే సందర్భంలోనిదిగా తెలుస్తుంది. కళ్ళకి కాటుక , ప్రత్యేక అలంకరణ లేకపోయినా అందంగా , రమ్యంగా కన్పిస్తున్న తన ప్రేయసి అచ్చియమ్మ ని చూస్తూ పెద్ది హుక్ స్టెప్స్ వేస్తూ కన్పించాడు. కొండల్లో లోయల్లో అందమైన ప్రకృతి ఒడిలో ఈ సాంగ్ ను షూట్ చేసినట్టు కనపడుతుంది.
“చికిరి చికిరి అంటూ కదిలే ఈ పాటలో, ‘ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క… నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…’ వంటి మాటలను రెహ్మాన్ తన ప్రత్యేకమైన శైలిలో ఆవిష్కరించారు.అందుకు తగ్గట్టే మోహిత్ చౌహాన్ తన ఎనర్జిటిక్ వాయిస్‌తో పాటకు మరింత ఉత్సాహం నింపాడు.” ఏ ఆర్ రెహ్మాన్ బాణీలు చాలా బాగున్నాయి , మొదటి సారి వినగానే ఆకట్టుకునేలా వున్నాయ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నఈ మూవీ మార్చ్ 27, 2026 న విడుదల చేయనున్నారు.