SSMB29: కుంభ వచ్చేశాడు.. మహేష్ – రాజమౌళి సినిమా నుండి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్!

విలన్ రోల్స్ డిజైన్ చేయడంలో రాజమౌళి దిట్ట. విలన్ రోల్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటే.. హీరోని అంత బాగా ఎలివేట్ చేయొచ్చు అని రాజమౌళి చెబుతూ ఉంటారు. అందుకే అతని సినిమాల్లో విలన్ రోల్స్ చేసిన వాళ్ల పర్సనాలిటీలు కూడా భారీగా ఉంటాయి. కాకపోతే మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను తీసుకున్నారు. మహేష్ కటౌట్ ముందు పృథ్వీ రాజ్ చిన్నగానే కనిపిస్తాడు.

Prithviraj Sukumaran As Kumbha

కానీ పెర్ఫార్మన్స్ విషయంలో పృథ్వీరాజ్ ఎక్కడా తగ్గరు. పైగా మహేష్ తో చేస్తున్న అడ్వెంచరస్ మూవీలో విలన్ టెక్నికల్ గా స్ట్రాంగ్ గా కనిపించాలి. అందుకే రాజమౌళి పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. తాజాగా అతని పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. “ఫస్ట్ షాట్ తీసిన వెంటనే నేను పృథ్వీతో చెప్పాను.

‘నేను చూసిన ఫైనెస్ట్ యాక్టర్స్ లో నువ్వు కూడా ఒకడివి’ అని.! మీట్ అవర్ కుంభ. అత్యంత క్రూరమైన, దయలేని, అలాగే పవర్ ఫుల్ విలన్. కుంభ పాత్ర నాకు ఎంతో సంతృప్తినిచ్చింది.తన కుర్చీలోకి… నిజంగానే… ఇమిడి పోయినందుకు నీకు ప్రత్యేక ధన్యవాదాలు పృథ్వీ” అంటూ రాజమౌళి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇక ఈ లుక్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ గా కనిపిస్తున్నప్పటికీ అతను పలికించిన హావభావాలు రూత్ లెస్ గా అనిపిస్తున్నాయి. అలాగే అతని కుర్చీ కూడా రోబోటిక్ చైర్ లా అనిపిస్తుంది. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలు తారాస్థాయికి వెళ్లడం ఖాయం.

 

 

‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus