సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈమె ఎప్పుడు మహిళలకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా తన గళం వినిపిస్తూ భారీగా నెటిజన్ల ట్రోల్స్ కి గురవుతున్నారు. ఇలా తరచూ ఏదోక విషయం ద్వారా వార్తల్లో నిలిచే చిన్మయి తాజాగా మరొక వీడియో ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలంలో అమ్మాయిలు డ్రెస్సులు మీద చున్నీలు వేసుకోవడం పూర్తిగా మానేశారు అంటూ ఒక అబ్బాయి అమ్మాయిలు ఎలాగో వేసుకోలేదు కనీసం నేనైనా చున్ని వేసుకుంటాను అంటూ ఒక వీడియోని చేశారు.
అయితే ఈ వీడియోని చిన్మయి పోస్ట్ చేస్తూ…అమ్మాయిలు చున్నీలు వేసుకోవాలని చెప్పేవారు ముందు మన దేశ కల్చర్ ఏంటో తెలుసుకోవాలని చెప్పారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య సత్యేంద్రనాథ్ ఠాగూర్ భార్య జ్ఞానానందిని దేవి ఆడవాళ్లు వేసుకునే జాకెట్ కల్చర్ ను తీసుకొచ్చారని చిన్మయి చెప్పారు. అప్పటివరకు మహిళలు భారతదేశంలో జాకెట్ ధరించే వారు కాదని చీరని జాకెట్ గా మడిచి ధరించే వారని తెలియజేశారు.
అమ్మాయిలు చున్నీలు వేసుకోమని చెప్పే అబ్బాయిలు ప్యాంటు షర్ట్ వేసుకోవడం మానేసి పంచలు కట్టుకోవాలని తెలిపారు. జాకెట్లు లేకుండా ఉండటం చూసి బ్రిటిష్ వారు షాక్ అయ్యారని, స్త్రీలు జాకెట్ లేకుండా ఉండడం చూసి వారిలో కలిగే లైంగిక కోరికల వల్లే భారతీయ మహిళలు జాకెట్ వేసుకోవడం మొదలుపెట్టారంటూ ఈ సందర్భంగా చిన్మయి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బ్లౌజ్ వేసుకోవడం అనేది బ్రిటిష్ కల్చర్ అంటూ ఈమె తెలియజేశారు. ప్రతి ఒక్క విషయంలోనూ విజ్ఞానం పెంచుకోవాలి కానీ ప్రతి దానిని కామంతో చూడకూడదని చిన్మయి చెబుతూ ఈ సందర్భంగా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.