టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ శరవేగంగా సినిమాలలో నటిస్తున్నారు. ఒక సినిమాలో నటిస్తున్న సమయంలోనే మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఒకే ఏడాదిలో రెండు సినిమాలు విడుదలయ్యేలా ఈ హీరోలు కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు మాత్రం రెండేళ్లకు ఒక సినిమాలో నటించడం కష్టమవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని
హీరోలు చెబుతున్నా కొంతమంది హీరోలు మాత్రం వేగంగా ఎలా సినిమాలు చేస్తున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు ఒకప్పుడు ఏడాదికి ఒక సినిమాలో నటించిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ హీరోలు ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు. ఈ ఏడాది చిరంజీవి నటించిన భోళా శంకర్ థియేటర్లలో రిలీజ్ కానుండగా బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ కూడా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి థియేటర్ల వద్ద తమ సినిమాలతో సందడి చేసిన చిరంజీవి, బాలయ్య ఈ ఏడాది వేర్వేరుగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చిరంజీవి, బాలయ్యల సంక్రాంతి సినిమాలు బయ్యర్లకు భారీ స్థాయిలో లాభాలను అందించాయని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో లాభాలు వచ్చిన సినిమాలు ఇవేనని సమాచారం.
ఈ రెండు సినిమాలు విజయాలు సాధించిన నేపథ్యంలో మైత్రీ నిర్మాతలు మరిన్ని సినిమాల నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాలను ఎక్కువగా నిర్మించాలని ఈ నిర్మాతలు భావిస్తున్నారు. సంక్రాంతి సినిమాల విజయాలతో చిరంజీవి, బాలయ్య పారితోషికాలు పెరిగాయని సమాచారం.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?