టాలీవుడ్ దిగ్గజ నటుడిగా ఎదిగి అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు చిరంజీవి. ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ అయ్యారు. ఎత్తుపల్లాలు, అవమానాలు ఎన్నో చూస్తూ ఎదిగిన ఆయనకు పర్సనల్ గా కార్లంటే చాలా ఇష్టమట. అందుకే తన కార్స్ విషయంలో ఎప్పుడూ ప్రత్యేకత చాటుకుంటూ ఉంటారు చిరంజీవి. కోట్ల రూపాయలు వెచ్చించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ కార్స్ కొంటూ తన గ్యారేజీ నింపేస్తుంటారు. ప్రస్తుతం చిరంజీవి గ్యారేజీలో అత్యంత ఖరీదైన కార్లు చాలానే ఉన్నాయి. విదేశీ బ్రాండ్ కార్లతో పాటు చిరంజీవి దగ్గర రోల్స్ రాయిస్ స్పెషల్ ఎడిషన్ ఉంది.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ పేరుతో వచ్చిన ఈ ఎడిషన్ ని (Chiranjeevi ) చిరు ప్రత్యేకంగా తీసుకున్నారు. దీని విలువ సుమారు 8 కోట్లు ఉంటుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దగ్గర కూడా ఈ కారు ఉంది. అదేవిధంగా చిరంజీవి గ్యారేజ్‌లో రెండు టయోటా ట్యాండ్ క్రూయిజర్లు ఉన్నాయి. ఈ కార్లు ఎంతో లగ్జరీగా ఉంటాయి. ఇందులో ఒకటి ఇండియా మార్కెట్ లోకి విడుదల కాకముందే దిగుమతి చేసుకున్నారు చిరంజీవి. ఈ కార్లతో పాటు చిరంజీవి దగ్గర మెర్సెడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ కారు ఉంది.
అలాగే ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ వోగ్ కూడా చిరు గ్యారేజ్ లో ఉంది. దీని విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుంది. రీసెంట్ గానే టయోటా వెల్ ఫైర్ కారు కొనుగోలు చేశారు చిరంజీవి. దీని విలువ సుమారు రెండు కోట్ల రూపాయలు. బ్లాక్ కలర్ లో ఈ కారు తీసుకున్న చిరు.. ఇటీవలే రిజిస్టార్టైన్ కూడా చేసుకున్నారు. చిరంజీవికి 1111 నంబర్ సెంటిమెంట్ కాగా.. అన్ని కార్లకు అదే నంబర్ తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు చిరంజీవి దగ్గర ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దీని విలువ సుమారు 250 కోట్లు ఉంటుందట.
ఈ లెక్కన చూస్తే కేవలం వాహనాలకే మెగాస్టార్ ఓ 300 కోట్ల మేర ఖర్చు పెట్టారని చెప్పుకోవచ్చు. ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గానే భోళా శంకర్ సినిమా చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆశించిన ఫలితం రాబట్టలేదు. రీసెంట్ గా చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ రెండు సినిమాలు ప్రకటించారు. అందులో ఒకటి బింబిసార దర్శకుడు వశిష్టతో ఉండగా.. మరొకటి తన కూతురు సుస్మిత నిర్మాణంలో చేస్తున్నారు మెగాస్టార్.