Chiranjeevi: పెయిడ్‌ బ్యాచ్‌ మీదనే ఆ పంచ్‌లు అంటున్న చిరంజీవి ఫ్యాన్స్!

చిరంజీవి సెటైర్లు, పంచ్‌లు సినిమాల్లోనే కాదు. బయట కూడా ఉంటాయనే విషయం తెలిసిందే. గతంలో తక్కువగా కనిపించే ఈ పంచ్‌లు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. మొన్నీ మధ్య ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా విడుదల నేపథ్యంలో సినిమా రిపోర్టర్లు, మీడియా మీద పంచ్‌లు వేసిన చిరంజీవి, ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా గురించి క్రిటిక్స్‌ మీద కౌంటర్లు వేశారు. సినిమాకు ఇచ్చే రేటింగ్‌ల గురించి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. దీంతో సోషల్‌ మీడియాలో ఆ కౌంటర్లు, పంచ్‌లు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

‘వాల్తేరు వీరయ్య’ సినిమా భారీ విజయం నేపథ్యంలో చిరంజీవి విదేశాల్లో ఉన్న అభిమానులతో లైవ్‌ వీడియో కాల్‌లో మాట్లాడారట. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర కామెంట్స్‌ చేశారని సమాచారం. అందులో భాగంగానే సినిమా రేటింగ్‌లపై మాట్లాడారు అని అంటున్నారు. పెయిడ్‌ మీడియాతో ‘వాల్తేరు వీరయ్య’ వసూళ్లను ప్రభావితం చూద్దామనుకున్న యాంటీ టీమ్‌కి కౌంటర్‌గానే ఈ పంచ్‌లు పడ్డాయి అని అంటున్నారు నెటిజన్లు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు ఓవర్సీస్‌ వసూళ్లు భారీగా వస్తున్నాయనే విషయం తెలిసిందే.

2 మిలియన్స్ దాటి 2.5 మిలియన్స్ వైపుగా సినిమా దూసుకుపోతోంది. అమెరికాలో ఒకేసారి 27 ప్రాంతాల్లో సినిమా ప్రదర్శించారట. దీంతో భారీ ఎత్తున ఫ్యాన్స్‌ సందడి చేశారని సమాచారం. ఈ ఆనందాన్ని చిరంజీవి వీడియో కాల్‌లో పంచుకున్నారట అక్కడి అభిమానులు. ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ‘‘వాల్తేరు వీరయ్యకు 2.25 రేటింగ్స్ ఇచ్చారు. ఏంటా అని చూస్తే ఓవర్సీస్‌లో 2.25 మిలియన్స్ వసూలు చేసింది. వారు ఇచ్చిన నెంబర్ ఇంత వసూలు చేస్తుందని నేను ఊహించలేదు’’ అని అన్నారట చిరంజీవి.

ఇక మొత్తంగా వసూళ్లు చూస్తే రూ. 200 కోట్లు దాటిపోయింది. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది. త్వరలో ఈ సినిమా సక్సెస్‌ పార్టీ నిర్వహిస్తారని సమాచారం. ఇక ఓవర్సీస్‌ ఫ్యాన్స్‌తో చిరంజీవి మాట్లాడిన ఫుల్‌ వీడియో బయటకు వస్తే ఇంకొన్ని స్ట్రాంగ్‌ పంచ్‌లు ఉన్నాయి అంటున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus