ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు ఏ సినిమాను హిట్ చేస్తున్నారో ఏ సినిమాను ఫ్లాప్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ ఏడాది ప్రేక్షకుల నుంచి యావరేజ్ రివ్యూలు వచ్చిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవగా హిట్ టాక్ వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. అయితే గాడ్ ఫాదర్ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటానని చిరంజీవి నమ్ముతున్నారు.
లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా చిరంజీవి శ్రీముఖికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటివరకు నేను నటించిన సినిమాలలో హీరోయిన్ లేకుండా సాంగ్స్ లేకుండా లేవని ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలని నేను భావించానని ఆయన చెప్పుకొచ్చారు. వైవిధ్యానికి ప్రాధాన్యతనివ్వాలని అనుకున్న నేను లూసిఫర్ మూవీ చూసిన సమయంలో ఆ యాంగిల్ లో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలని అనుకున్నానని చెప్పుకొచ్చారు. లూసిఫర్ రీమేక్ లో నటించడం విషయంలో స్నేహితుల నుంచి ప్రోత్సాహం లభించిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్, ఫ్యామిలీ డ్రామా, పొలిటికల్ డ్రామా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయని చిరంజీవి అన్నారు. ఘట్ ఫీలింగ్ తో ఈ సినిమాలో నటించానని నా అంచనాలు, నా ఊహ తప్పు కావని ఆయన అన్నారు. ఈ సినిమా విషయంలో చిరంజీవి నమ్మకం నిజమవుతుందేమో చూడాలి. గాడ్ ఫాదర్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది.
ఈ సినిమా ప్రధాన భాషల్లో రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా బడ్జెట్ తో పోల్చి చూస్తే ఒక విధంగా ఈ సినిమా నిర్మాతలకు రిలీజ్ కు ముందే భారీగా లాభాలు వచ్చాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.