Chiranjeevi: గరికపాటి వివాదానికి చెక్ పెట్టిన మెగాస్టార్.. ఏమన్నారంటే?

దసరా పండుగ సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మెగాస్టార్ చిరంజీవికి గరికపాటి నుంచి చేదు అనుభవం ఎదురైన విషయం మనకు తెలిసిందే అందరి ముందు గరికపాటి చిరంజీవి పట్ల అసహనం వ్యక్తం చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై ఎంతోమంది మెగా అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు స్పందించి గరికపాటిని తప్పుపట్టారు. ఇకపోతే ఇలా గరికపాటి మెగాస్టార్ అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం ముదురుతున్నప్పటికీ ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం స్పందించలేదు.

ఇలా మెగాస్టార్ స్పందించకపోవడంతో ఈ వివాదం మరి కాస్త ముదిరింది. అయితే తాజాగా గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ కావడంతో విలేకరులతో మాట్లాడిన చిరంజీవి ఈ విషయంపై స్పందించారు. ఇలా ఈ విషయంపై మొదటిసారి స్పందించిన గరికపాటి ఈ వివాదానికి చెక్ పెట్టారు. ఈ క్రమంలోని చిరంజీవి మాట్లాడుతూ గరికపాటి పెద్దాయన ఆయన చేసిన వ్యాఖ్యలను చర్చించుకోవాల్సిన అవసరం లేదు అని మొదటిసారిగా ఈ విషయంపై స్పందించారు.

ఇలా ఆయన గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు అంటూ మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలతో నైనా ఈ వివాదానికి చెక్ పడుతుందా లేదంటే ఈ వివాదాన్ని ఇలాగే కొనసాగిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటన జరిగిన రెండు రోజులకే మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ విషయంపై మెగా అభిమానులు మర్చిపోవాలని ఎవరు కూడా అవమానకరంగా మాట్లాడొద్దు అంటూ ట్వీట్ చేసినప్పటికీ

అభిమానులు మాత్రం తగ్గేదేలే అన్నట్టు గరికపాటి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక చివరికి మెగాస్టార్ కూడా స్పందించి ఈ విషయాల గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. మరి ఇక్కడికైనా ఈ వివాదం ముగుస్తుందో లేదో చూడాలి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus