Chiranjeevi, Allu Arjun: బన్నీ అడిగితే మెగాస్టార్ ఓకే అంటారా..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ బాలీవుడ్ కు గట్టి పోటీని ఇస్తుందనే సంగతి తెలిసిందే. బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో తెరకెక్కిన సినిమాలే ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. కొత్త తరహా కథాంశాలతో, ప్రయోగాత్మక కథలతో టాలీవుడ్ దర్శకులు ఇతర దేశాల్లో సైతం తెలుగు సినిమాలకు ఊహించని స్థాయిలో ఆదరణ దక్కేలా చేస్తున్నారు. బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ గా నటించడం సాధారణంగా జరుగుతుంది. తెలుగులో కూడా ఈ మధ్య కాలంలో ఒక హీరో సినిమాలో మరో హీరో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు.

అల్లు అర్జున్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో పుష్ప సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ లో హిందీలో రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప మూవీ కోసం బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తితో ఎదురు చూస్తుండగా పుష్పలో చిరంజీవి కొన్ని నిమిషాల పాటు కనిపించినా సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి.

అయితే ప్రస్తుతం చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్ లకు దూరంగా ఉంటున్నారు. బన్నీ అడిగితే మాత్రం చిరంజీవి నో చెప్పే అవకాశాలు అయితే ఉండవు. ఒక పాటలో బన్నీ, చిరంజీవి కలిసి స్టెప్పులేస్తారని ఆ పాట సినిమాకే హైలెట్ కానుందని సమాచారం. అధికారికంగా క్లారిటీ వస్తే మాత్రమే ఈ వార్త నిజమో అబద్ధమో తెలిసే అవకాశం ఉంటుంది. చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో అల్లు అర్జున్ ఒక పాటలో కొన్ని సెకన్ల పాటు కనిపించారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus