మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా అయినా తెరకెక్కించాలని భావిస్తున్న డైరెక్టర్ల జాబితా ఎక్కువగానే ఉంది. మరో నాలుగేళ్ల తర్వాత చిరంజీవి సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చిరంజీవితో సినిమా చేయడానికి పోటీ పెరుగుతోంది. కమర్షియల్ టచ్ ఉన్న డైరెక్టర్లకు మాత్రమే చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని సమాచారం అందుతోంది.
కొంతమంది డైరెక్టర్లు చెప్పిన కథలు నచ్చినా చిరంజీవి నో చెప్పడం వెనుక అసలు కారణం ఇదేనని తెలుస్తోంది.
చిరంజీవి సినిమాల ఎంపిక విషయంలో, డైరెక్టర్ల విషయంలో పక్కా కమర్షియల్ లెక్కలను ఫాలో అవుతున్నారని సమాచారం అందుతోంది. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. మెగాస్టార్ పారితోషికం రేంజ్ భారీగానే ఉందని తెలుస్తోంది. ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా చిరంజీవి కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుండగా కళ్యాణ్ కృష్ణ, వశిష్ట డైరెక్షన్ లో చిరంజీవి తర్వాత సినిమాలు తెరకెక్కనున్నాయి.
త్వరలో ఈ రెండు సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. చిరంజీవికి క్రేజ్ భారీగా పెరుగుతోంది. యంగ్ జనరేషన్ ఫ్యాన్స్ లో చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి కొత్త తరహా కాన్సెప్ట్ లను ఎంచుకుంటున్నారు. చిరంజీవి పుట్టినరోజున ఈ సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. చిరంజీవి భోళా శంకర్ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతలో వేసుకోవాలని ఫ్యాన్స్ చెబుతున్నారు.
చిరంజీవికి (Chiranjeevi) అనుగుణంగా ఈ సినిమా స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేస్తున్నారని సమాచారం అందుతోంది. చిరంజీవి మల్టీస్టారర్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. చిరంజీవి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. చిరంజీవి చరణ్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఆ విధంగా జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?