మెగాస్టార్ కి సినిమా చూపించని బోయపాటి శ్రీను
- January 19, 2019 / 06:59 AM ISTByFilmy Focus
విడుదలైన రెండు గంటల్లోనే విపరీతమైన నెగిటివ్ టాక్ సొంతం చేసుకొన్న సినిమా ఏదైనా ఉంది అంటే అది “వినయ విధేయ రామ” అనే చెప్పాలి. అంతటి నెగిటివ్ టాక్ & రివ్యూస్ వచ్చినప్పటికీ మాస్ లో చరణ్ కి ఉన్న ఫాలోయింగ్ పుణ్యమా అని సినిమా కలెక్షన్స్ కి మాత్రం ఢోకా లేకుండాపోయింది. ఆ కారణంగా డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ సేఫ్ జోన్ లో పడగా.. ఈ సినిమాకి ఈస్థాయి డిజాస్టర్ టాక్ రావడానికి కారణం మాత్రం రామ్ చరణ్ మునుపటి చిత్రాల్లా చిరంజీవి “వినయ విధేయ రామ”ను చూడకపోవడమేనని తెలుస్తోంది.
- వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నిజానికి రామ్ చరణ్ తో సినిమా అంటేనే చిరంజీవి కథ ఒకే చేయాలి, షూటింగ్ మధ్యలో రషెస్ చూపించాలి, పూర్తయ్యాక సినిమా చూపించాలి. ఇలా చాలా చేయాలి. కానీ.. బోయపాటి ఇలాంటి ప్రొసీజర్ ను ఫాలో అవ్వలేదంట. ముఖ్యంగా.. తనకు సినిమా చూపించమని చిరంజీవి దర్శకుడు బోయపాటిని పలుమార్లు కోరినప్పటికీ.. ఏవో చిన్న చిన్న రషెస్ చూపించి సరిపెట్టేశాడట. ఆ కారణంగానే వినయ విధేయ రామ అనవసరమైన ట్రోలింగ్ కు గురైందని. చిరంజీవి ముందుగా చూసి ఉంటే కనీసం ఆ బాలేని సన్నివేశాలను ఎడిట్ చేయించేవాడని ఫిలిమ్ నగర్ లో చర్చించుకొంటున్నారు.

















