Waltair Veerayya: ఆ భాషపై దృష్టి పెట్టిన మెగాస్టార్ చిరంజీవి.. కానీ?

సంక్రాంతి పండుగ సినిమాలు మరో రెండు వారాల్లో థియేటర్లలో సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుండగా తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. 700కు పైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా థియేటర్లలో రిలీజ్ కానుంది. రీఎంట్రీలో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ సినిమాలు హిందీలో విడుదలైనా

ఆ సినిమాలు కమర్షియల్ గా మరీ భారీ స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదని కామెంట్లు వినిపించాయి. అయితే హిందీలో వాల్తేరు వీరయ్య మూవీ సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి. హిందీలో ప్రస్తుతం సౌత్ సినిమాలకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఉంది. టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా ఉన్నా అక్కడ కూడా సౌత్ సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి. తాజాగా వాల్తేరు వీరయ్య హిందీ టీజర్ విడుదలైంది. వాల్తేరు వీరయ్య హిందీ టీజర్ కు ఏకంగా 7 లక్షల వ్యూస్ వచ్చాయి.

ఈ స్థాయిలో వ్యూస్ సాధించడం అంటే సులువైన విషయం కాదు. వాల్తేరు వీరయ్య సినిమా బడ్జెట్ 140 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాకు 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రావాలని అభిమానులు భావిస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బాబీ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరినట్టేనని బాబీ అనుకుంటున్నారు.

చిరంజీవికి బాబీ వీరాభిమాని కావడంతో చిరంజీవిని కొత్తగా చూపించడంతో పాటు ఫ్యాన్స్ మెచ్చేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే వాల్తేరు వీరయ్య మూవీ ట్రైలర్ రిలీజ్ కానుండగా ట్రైలర్ తోనే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయేమో చూడాలి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus