ఈ నెల 22వ తేదీన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో అభిమానులు చిరంజీవి పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. అయితే చిరంజీవి ఆరేళ్లలో ఆరు ఇండస్ట్రీ హిట్లు సాధించడం గమనార్హం. ఈ రికార్డ్ మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే సొంతమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1987 నుంచి 1992 వరకు చిరంజీవి ప్రతి సంవత్సరం ఒక ఇండస్ట్రీ హిట్ సాధించారు. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు సినిమాలతో వరుసగా ఆరు ఇండస్ట్రీ హిట్లు చిరంజీవి ఖాతాలో చేరాయి.
యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో చాలామంది హీరోల ఖాతాల్లో ఇండస్ట్రీ హిట్లు ఉన్నా వరుసగా కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీ హిట్లు సాధించడంలో స్టార్ హీరోలు ఫెయిల్ అవుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చిరంజీవి రీఎంట్రీలో కూడా వరుస ఇండస్ట్రీ హిట్లను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుని టాలెంట్ ఉన్న దర్శకులకు ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
చిరంజీవి రీమేక్ సినిమాలకు కొంతకాలం దూరంగా ఉండాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్లపై చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. చిరంజీవి కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడగా మెగాస్టార్ కు వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి పారితోషికం సినిమా సినిమాకు అంతకంతకూ పెరుగుతోంది. సీనియర్ హీరోలలో చిరంజీవి హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
చిరంజీవి (Chiranjeevi) వరుస విజయాలతో మరింత సంతోషంగా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. యంగ్ జనరేషన్ టాలెంటెడ్ డైరెక్టర్లను చిరంజీవి ప్రోత్సహిస్తున్నారు. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న దర్శకులకు మెగాస్టార్ ఎక్కువగా అవకాశాలు ఇస్తుండటం గమనార్హం. చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.