Chiranjeevi: ‘రాము’ అంటే బాబోయ్‌ చాలా భయం..

  • September 1, 2022 / 01:31 PM IST

మెగాస్టర్‌ చిరంజీవి సెన్సాఫ్‌ హ్యూమర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఎంత స్పాంటేనియస్‌గా డైలాగ్‌లు చెప్పి నవ్వుల పువ్వులు పూయిస్తారో, సినిమా ఫంక్షన్లలోనూ అదే స్థాయిలో స్పాంటేనిటీతో డైలాగ్‌లు వేస్తారు. దీంతో అక్కడ నవ్వులు ఖాయం. అప్పటివరకు సీరియస్‌గా ఉన్న స్టేజీ అయినా.. ఠక్కున నవ్వులతో నిండిపోతుంది. తాజాగా ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌లో కూడా ఇదే పని చేశారు చిరంజీవి.

సినిమాలో నటీనటల గురించి, సాంకేతిక నిపుణుల గురించి చింరజీవి మాట్లాడటం ప్రారంభించారు. అందరి గురించి చెప్పుకుంటూ వచ్చిన హీరోయిన్‌ సంచిత బసు దగ్గరకి వచ్చారు. అప్పుడే మొదలైంది అసలు మజా. ‘‘హీరోయిన్‌ సంచితా బోస్‌.. ‘అవును బోస్‌ ఆఁ.. బాసా?’ ఏది కరెక్ట్‌’’ అని చిరంజీవి అడిగారు. దానికి హీరోయిన్‌ ‘బసు’ అని చెప్పింది. వెంటనే చిరంజీవి కరెక్ట్‌ చేసుకుంటూ. ‘ఎవడ్రా నాకు రాసిచ్చింది’ అంటూ గాల్లో ఓ పంచ్‌ విసిరారు. దీంతో నవ్వులే నవ్వులు.

‘‘అయినా నన్ను బాసు అంటుంటారు. నువ్వు బెంగాళీ అమ్మాయివి కదా బోస్‌ ఏమో అనుకున్నా’’ అని అన్నారు చిరు. ఆ తర్వాత ‘నువ్వు సంచి బసు.. నేను బాసు’ అంటూ మరోసారి రైమింగ్‌తో రప్ఫాడించాడు చిరు. దీంతో మరోసారి నవ్వులు అదిరిపోయాయి. ఆ వెంటనే హీరోయిన్‌ మీద వరుసగా ప్రశంసల జల్లు కురిపించారు చిరు. నీ నవ్వు బాగుంటుందని, పెదాలు మాత్రమే కాకుండా నీ కళ్లు కూడా నవ్వుతున్నాయి అంటూ చిరంజీవి ఆమెను మెచ్చుకున్నారు.

ఇదే కార్యక్రమంలో చిరంజీవి మరో ఆసక్తికర విషయం కూడా చెప్పారు. చిన్నతనంలో నాగబాబుతో ‘రాము’ అనే సినిమాకు వెళ్లినప్పుడు జరిగిన ఆసక్తికర సంఘటన అది. ‘‘ఎన్టీఆర్ ‘రాము’ సినిమాను నెల్లూరులో మా చుట్టాలు అబ్బాయితో కలసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి వెళ్లాం. నేను, నాగబాబు, మా చుట్టాలబ్బాయి కలసి టికెట్‌ కోసం క్యూలో నడుస్తుంటే మధ్యలో క్యూ ఆగిపోయింది. ఇరుకుగోడలు కావడంతో ఊపిరి ఆడటం కష్టమైంది’’ అంటూ అప్పటి విషయాలు గుర్తు చేసుకున్నారు చిరు.

‘‘ఆ తర్వాత ఇబ్బందులు పడుతూ రకంగా టికెట్ తీసుకొని బయటికి వస్తే.. మా నాన్న ఎదురుగా కనిపించారు. వెనుకేమో అమ్మ వుంది. అంతకుముందు షో చూసి వస్తున్నారు. మమ్మల్ని అక్కడ చూసి.. ‘నేల టికెట్‌లో సినిమా చూస్తావా? అంటూ పక్కనే ఉన్న కొబ్బరి మట్ట తీసి చితక్కొట్టారు. ఆ తర్వాత రోడ్డు మీద కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు. అందుకే ఇప్పటికీ ‘రాము’ సినిమా అంటే ఒంట్లో వణుకు పుడుతుంది” అని చెప్పుకొచ్చారు చిరు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus