Megastar: స్టూడియోలు, బిజినెస్‌లు.. మనసులోని మాట బయటపెట్టిన చిరంజీవి!
- January 29, 2026 / 06:06 PM ISTByFilmy Focus Writer
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ జోష్‌లో ఉన్నారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో వింటేజ్ బాస్‌ను వెండితెరపై చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా మీడియా ముందుకు వచ్చిన చిరు.. తన వ్యక్తిగత అభిప్రాయాలతో పాటు భవిష్యత్తు ప్రణాళికల గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు. ముఖ్యంగా రాజకీయాలు, సినిమాలు, వ్యాపారం వంటి విషయాలపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
Megastar
రాజకీయాల్లో ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో సినిమా ఇండస్ట్రీకి తాను ఎంత దూరమయ్యానో చిరంజీవి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ట్రెండ్‌లో ఉన్న హీరోయిన్లు కాజల్, తమన్నా కూడా తనకు తెలియదంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చని నవ్వేశారు. ఖైదీ నెంబర్ 150 సమయంలో కాజల్ పేరు చెబితే ఆమె ఎవరని అడిగిన సందర్భాన్ని కూడా ఆయన పంచుకున్నారు. పాలిటిక్స్, సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేసే సత్తా తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మాత్రమే ఉందని ఈ సందర్భంగా మెగాస్టార్ ప్రశంసించారు.
ఇక సొంతంగా స్టూడియో కడతారంటూ వస్తున్న వార్తలకు చిరంజీవి చెక్ పెట్టారు. తనకు వ్యాపారాలు చేయడం అస్సలు రాదని, స్టూడియోలు నిర్మించడంపై తనకు ఆసక్తి లేదని తేల్చి చెప్పారు. స్టూడియో అనేది ఒక ఆస్తి మాత్రమే తప్ప, అది లాభసాటి వ్యాపారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సిబ్బందిపై ఆధారపడి బిజినెస్ రన్ చేయడం తన వల్ల కాదని, అలాంటి పనులన్నీ బావ అల్లు అరవింద్ మాత్రమే చక్కగా డీల్ చేయగలరని చిరు స్పష్టం చేశారు.
దావోస్ పర్యటన గురించి స్పందిస్తూ.. అది రాజకీయ పర్యటన కాదని క్లారిటీ ఇచ్చారు. అక్కడికి అనుకోకుండా వెళ్లాల్సి వచ్చిందని, మిత్రుల కోరిక మేరకే ఇండస్ట్రీ ప్రతినిధిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. తన లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి త్వరలో పాడ్‌కాస్ట్‌లు చేయాలనే ఆలోచన ఉందన్నారు. అలాగే డైరెక్టర్ బాబీతో చేయబోయే సినిమా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా, అభిమానులు కోరుకునే స్టైల్‌లో ఉంటుందని అప్‌డేట్ ఇచ్చారు. చిరంజీవి తన డైలీ లైఫ్ గురించి చెబుతూ.. రోజులో ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదని అన్నారు.












