Vaaltheru Veerayya: ఫ్యాన్స్‌ మాటలు వినలేదా.. వినిపించలేదా.. చిరూ!

సినిమా పేరును హీరోనే లీక్‌ చేసేస్తే… ఎలా ఉంటుంది? అదో విచిత్రమైన పరిస్థితి. దీన్ని లైవ్‌లో చూడాలంటే చిరంజీవి రీసెంట్‌ సినిమాల సంగతి చూస్తే సరి. ‘ఆచార్య’ సినిమా పేరును ఓ సినిమా ప్రచార కార్యక్రమం వేదికగా చెప్పేశాడు చిరంజీవి. దాంతో ఆ రోజుల్లో ‘మెగా లీక్స్‌’ అంటూ పేరు పెట్టేశారు. దానిని కంటిన్యూ చేస్తూ చిరంజీవి నెక్స్ట్‌ సినిమా పేరును కూడా లీక్‌ చేశారు. అదే ‘వాల్తేరు వీరయ్య’. అవును బాబీతో చేస్తున్న సినిమా పేరును చిరంజీవి లీక్‌ చేసేశారు.

Click Here To Watch NOW

యువ దర్శకులతో చిరంజీవి ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. అందులో బాబీ సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమా పేరు చెప్పబోయారు. అయ్యో మళ్లీ లీక్‌ చేసేశారు అని అంటారేమో అనుకుంటూ.. మళ్లీ ఏమనుకున్నారో ఏమో ‘వాల్తేరు వీరయ్య’ అంటూ పేరును లీక్‌ చేసేశారు చిరంజీవి. అక్కడ జరిగిన తంతు చూస్తే కావాలనే చిరంజీవి పేరు చెప్పేసినట్లు అనిపించింది. ఆ విషయం పక్కనపెడితే ఫ్యాన్స్‌ని పట్టించుకోలేదు అనే మాట వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో బాబీ దర్శకత్వం తెరకెక్కుతున్న సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే పేరు పెడుతున్నారని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి.

ఆ మధ్య డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ఈ పేరు చెప్పేశారు. ఏదో వర్కింగ్‌ టైటిల్‌ చెప్పేశారేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు చిరంజీవి కూడా చెప్పాక ఇక పక్కా అనేయాల్సిందే. సినిమా పేరు బాగానే ఉన్నప్పటికీ ఓల్డ్‌గా ఉందనిపిస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ గతంలో బయటకు వచ్చినప్పుడు ‘ఇంత పాత పేరా?’ అనే అనుకున్నారు ఫ్యాన్స్‌, నెటిజన్లు. కానీ ఆ మాటలు, రిక్వెస్ట్‌లు లాంటివి చిరంజీవి వరకు వెళ్లలేదో, లేక వెళ్లినా వినలేదో తెలియదు కానీ ఆ పేరునే ఫైనల్‌ చేశారు.

ఈ సినిమాలో చిరంజీవి అండర్‌ కవర్‌ కాప్‌గా కనిపిస్తాడని సమాచారం. విశాఖపట్నం పోర్ట్‌ ఏరియా నేపథ్యంలో సినిమా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus