Chiranjeevi,Ram Gopal Varma: ఆర్జీవీ.. అతని శిష్యులతో చిరంజీవి సినిమా అంటే ఆగిపోవడమే.. లిస్ట్‌ చూస్తే మీరూ..!

చిరంజీవితో  (Chiranjeevi) సినిమా ఛాన్స్‌ రావడం అంత ఈజీ కాదు, ఒకవేళ వచ్చాక ఆ సినిమా పూర్తి స్థాయిలో సిద్ధమై బయటకు రావడమూ అంత ఈజీకాదు. ఎందుకంటే చాలా సినిమాలు చర్చల దశల్లో, షూటింగ్‌ దశలో, ఆ తర్వాతి దశల్లో నిలిచిపోయి, మురిగిపోయాయి. అయితే వాటిల్లో ఓ కామన్‌ పాయింట్‌ చూస్తే ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. అదే రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) . ఆయన లేదంటే ఆయన దగ్గర శిష్యరిక చేసిన వాళ్ల సినిమాలు చిరంజీవితో ఓ పట్టాన తేలవు.

Chiranjeevi,Ram Gopal Varma:

కావాలంటే మీరే చూడండి. చాలా ఏళ్ల క్రితం చిరంజీవి – రామ్‌ గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలైంది. దానికి ‘వినాలని ఉంది’ అనే పేరు కూడా పెట్టారు. ఆ సినిమాకు సంబంధించి ఓ పావు వంతు షూటింగ్‌ కూడా జరిగింది. అయితే సినిమా విషయంలో తేడాలొచ్చి ఆపేశారు. కొన్నాళ్లకు అయినా తిరిగి మ మొదలవుతుందేమో అనుకుంటే ఆ సినిమాలోని పాటల్ని తర్వాత ‘చూడాలని ఉంది’ (Choodalani Vundi) లో వాడేశారు.

ఇక ఆర్జీవీ శిష్యుడు కృష్ణ వంశీతో (Krishna Vamsi) కూడా చిరంజీవి ఓ సినిమా చేయాల్సి ఉంది. ‘వందేమాతరం’ అంటూ 2004లో ఓ సినిమా అనుకున్నారు. అయితే బడ్జెట్‌ తదితర కారణాల వల్ల ఆ సినిమాను పట్టాలెక్కించలేదు. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ కలసి పని చేయలేదు. అయితే రామ్‌చరణ్‌తో (Ram Charan) ‘గోవిందుడు అందరివాడేలే’ (Govindudu Andarivadele) చేశారు. ఆ సినిమా దారుణమైన ఫలితం అందుకుంది. ఇక వర్మ మరో శిష్యుడు పూరి జగన్నాథ్‌తో (Puri Jagannadh) కూడా చిరంజీవి ఓ సినిమా అనుకున్నారు.

కథ దాదాపు ఓకే అయింది అనుకోగా.. సెకండాఫ్‌ విషయంలో ఇబ్బంది వచ్చి ఆపేశారు. ‘లైగర్‌’  (Liger)  తర్వాత ఉండొచ్చు అనే టాక్‌ వచ్చినా.. ఆ సినిమా ఫలితం కారణమో ఏమో మళ్లీ వినిపించలేదు. ఇక ఆయన శిష్యుడు హరీశ్‌ శంకర్‌తో (Harish Shankar) చిరు సినిమా అని ఆ మధ్య మాటలు వచ్చాయి. అయితే ఇంకా ఈ విషయంలో ఎలాంటి లెక్కా తేలడం లేదు. కాబట్టి చిరంజీవితో ఆర్జీవీ అండ్‌ కో సినిమా అంటే అంత ఈజీ కాదు.

కెరీర్‌ గ్రోత్‌ అంటే ఏంటో వివరంగా చెప్పిన విశ్వక్‌సేన్‌.. ఏం చెప్పాడంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus