Chiranjeevi: చిరంజీవి పేరే అఫీషియల్‌ నెంబర్‌ ప్లేట్‌… ఎవరు పెట్టుకున్నారు? ఏంటా స్పెషల్‌!

బైక్‌, కారు నెంబర్‌ ప్లేట్‌ మీద తమ అభిమాన నటులు, క్రికెటర్లు, మనసైన వారి పేర్లు రాసుకోవడం మీరు చూసే ఉంటారు. కానీ ఏకంగా నెంబర్‌ ప్లేట్‌ మొత్తాన్ని ఆ పేరు కోసం కేటాయించిన వారిని ఎప్పుడైనా చూశారా? మన దగ్గర ఇలాంటి అవకాశం లేదు కానీ.. విదేశాల్లో కొన్ని చోట్ల ఉంది. అలా ఓ వ్యక్తి చిరంజీవి (Chiranjeevi) పేరును అఫీషియల్‌గా నెంబర్‌ ప్లేట్‌పై రాయించుకున్నారు. ఇప్పుడు ఆయన గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Chiranjeevi

టెక్సాస్‌లో ఉంటున్న డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ.. మెగాస్టార్‌ చిరంజీవికి పెద్ద అభిమాని. పెద్ద అనే కంటే అందరికంటే పెద్ద అని చెప్పినా ఫర్వాలేదు. ఎందుకంటే ఆయనే చిరంజీవి పేరును తన టెస్లా కారుకు పెట్టుకున్నారు. ‘మెగాస్టార్’ అని పేరు కారు నెంబర్‌ ప్లేట్‌ను అఫీషియల్‌గా పెట్టుకున్నారు. అంటే ఆయన కారుకు ఇంకో నెంబర్‌ ప్లేట్‌ ఉండదు. మెగాస్టార్‌ అనేదే ఆయన నెంబర్‌ ప్లేట్‌.

అమెరికాలో వైద్య వృత్తిలో ఉన్నత స్థాయిలో ఉన్న డాక్టర్ ఇస్మాయిల్ సుహైల్ పెనుకొండ.. చిరంజీవి అభిమాని అని ఇప్పటికే కొంతమందికి తెలుసు. చిరంజీవి సినిమా విడుదల సమయంలో ఆయన హడావుడి అలా ఉంటుంది. సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తుంటారు. ఆ సమయంలో టెక్సాస్ సిటీలో ఆయన హంగామా వేరే స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు దానికి నెంబర్‌ ప్లేట్‌ రేర్‌ ఫీట్‌ యాడ్‌ అయ్యింది.

‘మెగాస్టార్’ అనే నంబర్ ప్లేట్ ఉన్న కారు ముందు ఒక అమెరికన్‌ పోజ్‌ ఇచ్చారు. ఆ ఫొటోలు వైరల్‌ అవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. టెస్లా ఛార్జింగ్ స్టేషన్ దగ్గర డాక్టర్ ఇస్మాయిల్ సుహైల్ పెనుకొండ కారును పార్క్‌ చేసి ఉండగా ఆ ఫొటోను క్లిక్‌ మనిపించారు. దీంతో అసలు విషయం ఏంటా అని చూస్తే ఇస్మాన్‌యిల్‌ సుహైల్‌ పెనుకొండ వీరాధి వీరాభిమాని ఆఫ్‌ చిరంజీవి అని తెలిసింది.

దెయ్యాల వెంట పడుతున్న టాలీవుడ్ హీరోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus