బ్రహ్మోత్సవం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబై లో జరుగుతోంది. ఈ షూటింగ్ స్పాట్ కి మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. చిరు మురుగదాస్ తో స్టాలిన్ మూవీ చేశారు. అప్పుడే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అతను డైరక్ట్ చేసిన కత్తి సినిమాను ఖైదీ నంబర్ 150 గా రీమేక్ చేశారు. డైరక్టర్ పిలుపు మేరకు సెట్స్ కి వెళ్లిన చిరుకి మహేష్ బాబుతో పాటు యూనిట్ మొత్తం సాదరంగా స్వాగతం పలికింది.
కాసేపు షూటింగ్ ని వీక్షించిన మెగాస్టార్ అనంతరం మురుగదాస్, మహేష్ తో కలిసి సినిమా గురించి చర్చించారు. ముగ్గురు సీరియస్ డిస్కషన్ లో ఉండగా ఆ సినిమా సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఫోటో క్లిక్ మనిపించారు. చిరు రాక మాకెంతో సంతోషమంటూ కొన్ని క్షణాల క్రితం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని ఉగాది పండగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫిల్మ్ జూన్ 23 న థియేటర్లోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.