Chiranjeevi: అయ్యప్ప పూజా కార్యక్రమాలలో పాల్గొన్న చిరు… వీడియో వైరల్!

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ చిరంజీవి బిజీగా ఉన్నారు. ఇక మెగాస్టార్ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ ఆయన దైవ భక్తుడు అనే విషయం మనకు తెలిసిందే. ఏ శుభకార్యం జరిగిన ఏదైనా పండుగలు వచ్చిన చిరంజీవి పెద్ద పెద్దన్న పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఈ విధంగా చిరంజీవికి భక్తి భావం ఎక్కువ అనే విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా చిరంజీవి అయ్యప్ప మాల ధరిస్తారనే విషయం మనకు తెలిసిందే. చిరంజీవి మాత్రమే కాకుండా రామ్ చరణ్ కూడా అయ్యప్ప దీక్ష తీసుకోవడం మనం చూస్తుంటాము.ఇలా మెగా ఫ్యామిలీ అయ్యప్ప స్వామి వారిని ఎంతో విశ్వసిస్తూ ఉంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అయ్యప్ప పడిపూజ ఎంతో ఘనంగా జరిగింది.

ఈ క్రమంలోనే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పడిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ పడిపూజ కార్యక్రమానికి హాజరై అయ్యప్ప స్వామి వారిని ప్రత్యేకంగా పూజించి నమస్కరించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నుంచి విడుదలైనటువంటి టీజర్స్, ట్రైలర్, పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus