మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నాడు. దీని తరువాత మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘వేదాలం’ రీమేక్ ను కూడా చెయ్యబోతున్నాడు. ఇది కూడా పూర్తయ్యాక ‘లూసిఫర్’ రీమేక్‌లో నటించడానికి ఓకే చెప్పారు. నిజానికి ‘ఆచార్య’ తరువాత ‘లూసిఫర్’ రీమేక్లోనే చిరు నటించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా మధ్యలో మెహర్ రమేష్ సినిమా వచ్చి చేరింది. దీనికి కారణం కూడా లేకపోలేదు.’లూసిఫర్’ రీమేక్ కు సరైన దర్శకుడు దొరకడం లేదు. సుకుమార్ దగ్గర నుండీ మొదలుపెట్టి సుజీత్, వి.వి.వినాయక్, హరీష్ శంకర్ ఇలా చాలా మందిని సంప్రదించారు చిరు.
ఓ దశలో వినాయక్ ఫిక్స్ అని ప్రచారం జరిగింది. కానీ ఆయన ఈ స్క్రిప్ట్ పై ఇంట్రెస్ట్ చూపించడం లేదని ఇన్సైడ్ టాక్. అందుకే మోహన్ రాజా అనే తమిళ దర్శకుడిని ఎంపిక చేసుకున్నట్టు ప్రస్తుతం టాక్ నడుస్తుంది. నిజానికి ఇతను ‘ధృవ’ సీక్వెల్ కోసం చరణ్ ను సంప్రదించాడట. అయితే చరణ్ ఇతని స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేసినట్టు సమాచారం. అదే సమయంలో ఇతను అనుకోకుండా మెగాస్టార్ ను కలవడంతో ‘లూసిఫర్’ రీమేక్ డిస్కషన్ వచ్చిందట. ఈ రీమేక్ విషయంలో మోహన్ రాజా అభిరుచి ఎలా ఉందో తెలుసుకోవాలని..
ఇతన్ని కొన్ని సలహాలను సూచించమని కోరారట మెగాస్టార్. ఈ నేపథ్యంలో మోహన్ రాజా చెప్పిన మార్పులు చిరుకి బాగా నచ్చాయట. అందులోనూ ఇతను రీమేక్ సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు.. అందుకే చిరు ఇతన్ని ‘లూసిఫర్’ రీమేక్ కు దర్శకుడిగా ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే మోహన్ రాజా పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి చిరుని మెప్పిస్తే కానీ.. ఇతను ఈ ప్రాజెక్టుకి డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడని చెప్పలేము.
Most Recommended Video
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!