మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదలైన రెండున్నర నెలలు అవుతోంది. కానీ ఆ సినిమాకి సంబంధించిన చేదు అనుభవాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా వ్యాపార వ్యవహారాల్లో కీకాలంగా వ్యవహరించినందుకు దర్శకుడు కొరటాల శివ మెడకు నష్ట పరిహారం వ్యవహారం చుట్టుకుంది. కొన్ని ఏరియాల వరకు సెటిల్మెంట్ పూర్తయినా.. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్లకు పరిహారం విషయంలో ఎటూ తేల్చకపోవడంతో వాళ్లు కొరటాల ఆఫీస్ వరకు వచ్చి ఆందోళన చేపట్టే పరిస్థితి వచ్చింది.
కొంతమేర సెటిల్ చేసి.. మిగిలినది తరువాత ఇస్తానని చెబుతున్నా వారు ఊరుకోవడం లేదట. తాము ఎంత నష్టపోయామో అంతా చెల్లింపులు చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో చాలా మంది చిరంజీవిని నిందిస్తున్నారు. ఆయన కూడా నష్టాల్లో పాలు పంచుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మాత్రం కొరటాలని ట్రోల్ చేస్తున్నారు.
కథ-కథనాలపై దృష్టి పెట్టకుండా బిజినెస్ మీద ఫోకస్ చేస్తే ఇలానే ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మెగా క్యాంప్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి రూ.20 కోట్లను నష్టపరిహారం కింద ఇచ్చినట్లు టాక్. నిజానికి చిరు కానీ.. చరణ్ కానీ ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోలేదట.
రిలీజ్ తరువాత చూసుకుందాం అనుకున్నారు. కానీ సినిమాకి నష్టాలు రావడంతో వారు రెమ్యునరేషన్ అడగలేదట. తమ బ్యానర్ ని ఇన్వాల్వ్ చేయడంతో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు కొంత మొత్తం ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!