Chiranjeevi: బయ్యర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ఆయనపై పడిందా?

భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య సినిమా ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చిరంజీవి, చరణ్ నటించిన ఏ సినిమాకు ఆచార్య సినిమా స్థాయిలో నష్టాలు అయితే రాలేదని చెప్పవచ్చు. ఆచార్య సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసిన నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్, ఇతర విషయాలకు సంబంధించి అసలు లెక్కలు బయటికొచ్చాయి.

ఈ సినిమాకు 70 కోట్ల రూపాయలు ఖర్చైందని చిరంజీవి, చరణ్ లకు 50 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా దక్కిందని సినిమా బిజినెస్ వ్యవహారాల విషయంలో మాత్రం కొరటాల శివ కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. కొరటాల స్నేహితులు కొన్ని ఏరియాలలో ఆచార్య సినిమాను ఓన్ గా రిలీజ్ చేశారు. అయితే చిరంజీవి 10 కోట్ల రూపాయలు వెనక్కు ఇచ్చారని సమాచారం అందుతోంది. శాటిలైట్, డిజిటల్ హక్కులకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి రాగా ఈ మొత్తంతోనే ఆచార్య నష్టాలను కొరటాల శివ భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.

కొరటాల శివకు ఈ సినిమాతో ఆర్థికంగా ఏమీ మిగలదని ఆయన సొంత డబ్బులు కూడా కొంతమేర ఖర్చయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. మెగా హీరోలు ఇంకొంత మొత్తం వెనక్కు ఇస్తే బాగుంటుందని ఆచార్య బయ్యర్లు భావిస్తున్నారు. ఆచార్య రిలీజ్ తర్వాత చిరంజీవి ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లారనే సంగతి తెలిసిందే. వెకేషన్ నుంచి తిరిగివచ్చిన తర్వాత చిరంజీవి ఈ విషయంపై దృష్టి పెట్టే ఛాన్స్ అయితే ఉంది.

ఆచార్య సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం భారీ నష్టాలను మిగిల్చింది. చిరంజీవి కొరటాల శివ, బయ్యర్లతో చర్చించి కొంతమేర నష్టాలను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు ప్రచారంలోకి వస్తున్నాయి. కొరటాల శివ ప్రస్తుతం తన తర్వాత సినిమా పనులతో బిజీ అయ్యారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus