4 ఏళ్ళుగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఈరోజు అంటే మార్చి 25న విడుదలైంది. థియేటర్లు మొత్తం జనాలతో కళకళలాడిపోతున్నాయి. పాండమిక్ తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ ఈరేంజ్లో కళకళలాడుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు. అది రాజమౌళి సినిమాలకి మాత్రమే సాధ్యమని మారోసారి ప్రూవ్ అయ్యింది. ‘ఆర్.ఆర్.ఆర్’ ను చూసిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఈ సినిమాని చూడడానికి ఎగబడుతున్నారు. ఇక ఈ చిత్రం పై సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్న వేళ..
హీరో రాంచరణ్ తండ్రి అలాగే మన మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని వీక్షించిన తర్వాత ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని తెలియజేసారు. ‘ఆర్.ఆర్.ఆర్’ అనేది మాస్టర్ స్టోరీ టెల్లర్(దర్శకుడు రాజమౌళిని ఉద్దేశిస్తూ) యొక్క మాస్టర్ పీస్ అని చిరు ప్రశంసించారు. రాజమౌళి విజన్ నిజంగా అద్భుతమని.. చెబుతూ ఆయన ‘ఆర్.ఆర్.ఆర్’ టీంకి కంగ్రాట్స్ చెప్పారు. అంతకు ముందు ఆయన సినిమా చూసాక…ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ” ‘ఆర్ఆర్ఆర్’ ఎలా ఉందనే విషయాన్ని చెప్పడానికి మాటలు లేవని..
సింప్లీ సూపర్బ్ అని ఆయన కొనియాడారు.మెయిన్ గా సినిమాలో చరణ్, తారక్ ల మధ్య బాండింగ్ ఫెంటాస్టిక్ ,ఇద్దరు డ్యాన్సుల్లో కూడా ఒకరితో ఇంకొకరు పోటీపడి చేశారని వీరి డాన్స్ ఎపిక్, ఇంకా చెప్పాలంటే క్లాసిక్ అంటూ తెలిపారు చిరు.ముందు ముందు తెలుగు సినీ పరిశ్రమలో ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని.. స్టార్ హీరోలు కలిసి నటించాలని మెగాస్టార్ చిరంజీవి కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.