దర్శకధీరుడు రాజమౌళికి పరిశ్రమలో ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలను శాశించగల స్థాయిలో ఆయన ఉన్నారు. హీరో ఎవరైనా ఆయన బ్రాండ్ ఇమేజ్ తో సినిమాని నడిపించగలడు. మరి అలాంటి దర్శకుడితో సినిమా నిర్మించే అవకాశం దక్కిందంటే కాసుల పంట పండినట్టే. బాహుబలి చిత్రాల వసూళ్లే అందుకు నిదర్శనం. ఆ సినిమా నిర్మాతకు, బయ్యర్లకు లెక్కకు మించిన లాభాలు ఆ రెండు చిత్రాలు తెచ్చిపెట్టాయి. కాగా రాజమౌళి లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలుగా ఉండడానికి తీవ్ర పోటీ నడించింది.
ఈ పోటీలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారని, ఆయన ఈ చిత్ర నిర్మాణ భాద్యతల కోసం తీవ్రంగా ప్రయత్నించారని తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ నిర్మాణ బాధ్యల కోసం చిరంజీవి రాజమౌళి తో బేరసారాలు జరిపారట. ఐతే రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం డి వి వి దానయ్య చాన్నాళ్ల క్రితమే ఆయనకు అడ్వాన్ ఇచ్చి వున్నారు. దీనితో చిరంజీవి ప్రపోజల్స్ ఆయన అంగీకరించలేకపోయారట. ఈ విషయంలో అసహనానికి గురైన చిరంజీవి అసలు ఈ ప్రాజెక్ట్ చేయవద్దని చరణ్ తో కూడా చెప్పారట.
ఐతే తరువాత చరణ్ ఆయన్ని చిన్నగా కన్వీన్క్ చేశారట. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందొ తెలియదు కానీ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఇక బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా దానయ్యకు ఏకంగా 100 కోట్లు ఆఫర్ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఐతే ఈ ఆఫర్ ని తిరస్కరించిన దానయ్య ఆర్ ఆర్ ఆర్ నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ 500 కోట్లకు పైగా జరిగిన విషయం తెలిసిందే.
Most Recommended Video
అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!