ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటే అందులో అల్లు అరవింద్, అల్లు అర్జున్ ను ప్రత్యేకంగా చెప్పేవాళ్ళు కాదు. మెగాస్టార్ చిరంజీవి ట్యాలెంట్ ను గుర్తించి అల్లు రామలింగయ్య గారు అల్లుడిగా చేసుకుంటే.. అల్లు అరవింద్ తన స్ట్రాటెజీలతో చిరు స్టార్ హీరోగా ఎదగడంలో కీలక పాత్ర పోషించారు. మెగా ఫ్యామిలీకి ఏ సమస్య వచ్చినా దానిని సాల్వ్ చేయడానికి అల్లు అరవింద్ ముందుండేవారు. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన అల్లు అరవింద్ ఎక్కువగా మెగా హీరోలతోనే సినిమాలు చేసేవారు అన్న సంగతి తెలిసిందే.
అయితే కొంతకాలంగా అల్లు ఫ్యామిలీ.. మెగా ఫ్యామిలీ అనే ట్యాగ్ కు దూరంగా ఉంటుంది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. అల్లు అర్జున్ … మెగా ట్యాగ్ కు దూరంగా ఉండాలని అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఇక అల్లు అరవింద్.. చిరుని కాదని బాలయ్యతో అన్స్టాపబుల్ షో నిర్వహించడం అలాగే తన కొడుకు సినిమాకి కూడా బాలయ్యని గెస్ట్ గా తీసుకురావడం వంటివి ఈ వార్తలకు బలం చేకూర్చాయి అని చెప్పాలి.
అయితే ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు ఈ విషయం పై స్పందించారు. ‘ఈ ఇంటర్వ్యూ జనవరి 10 న జరుగుతుంది. ఈరోజు అల్లు అరవింద్ గారి పుట్టినరోజు. ఈ ఇంటర్వ్యూ అయిన వెంటనే ఆయన ఇంటికే వెళ్ళడానికి బుకే చెప్పి వచ్చాను. నేను సురేఖ కుదిరితే ఈరోజు అక్కడే లంచ్ చేసి వస్తాం. మొన్న క్రిస్మస్ కు కూడా బన్నీ మా ఇంటికి వచ్చి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. ప్రొఫెషన్ రీత్యా బన్నీ లేదా నా తమ్ముడు కళ్యాణ్ సొంతంగా ఎదగాలి,
ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాలి అని ఆశపడితే కనుక అందుకు నేను చాలా సంతోషపడతాను.. ఆ స్పిరిట్ అందరిలోనూ ఉండాలని కోరుకుంటాను. అది తప్పేమి కాదు’ అంటూ చిరు చెప్పుకొచ్చారు. అంతే కాదు ‘అన్స్టాపబుల్’ వంటి షోలు తాను హోస్ట్ చేయకపోవడానికి కారణం తన వరుస సినిమాలు కమిట్ అవ్వడం వల్లనే అని కూడా చిరు తెలిపారు.