Chiranjeevi: గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటే నేనేమి చేయలేను: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ సినిమాకి రీమేక్ చిత్రంగా తెలుగులో మోహన్ రాజా ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఇకపోతే తాజాగా మీడియా సమావేశంలో భాగంగా పాల్గొన్నటువంటి మెగాస్టార్ చిరంజీవికి విలేకరుల నుంచి ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ సందర్భంగా విలేకరులు అడిగిన అన్ని ప్రశ్నలకు మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే గాడ్ ఫాదర్ సినిమాలో ఉన్నటువంటి పొలిటికల్ డైలాగ్స్ గురించి ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి.నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు అని డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ ఈ డైలాగులు పెట్టారంటూ వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఈ డైలాగులపై ప్రశ్నలు ఎదురవడంతో మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో స్పందిస్తూ సమాధానం చెప్పారు.ప్రస్తుతమున్న రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ డైలాగులు వెయ్యాలన్న ఉద్దేశం మాకు ఏమాత్రం లేదని తెలిపారు. ఒరిజినల్ సినిమాలో ఉన్న డైలాగులను ఇక్కడ తెలుగువారికి చేరువయ్యేలా రాశామని తెలిపారు. పొలిటికల్ గా సెటైర్లు వేయాలన్న ఉద్దేశంతో మేము డైలాగులు రాయలేదని, కథ డిమాండ్ చేసిన విధంగానే డైలాగులు రాశామని తెలిపారు.

అయినా ఈ డైలాగులు మమ్మల్ని ఉద్దేశించే అన్నారని కొందరు భుజాలు తడుముకుంటే తానేమి చేయలేదని ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకుల గురించి మెగాస్టార్ చిరంజీవి కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus