Chiranjeevi: వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ లో రిటైర్మెంట్ గురించి చిరు షాకింగ్ కామెంట్స్!

మెగాస్టార్ చిరంజీవి వరస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఈయన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇలా గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.ఈ క్రమంలోనే ఒక విలేకరి మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నిస్తూ కెరియర్ మొదట్లో మీరు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం ఎన్నో సాహసభరితమైన సన్నివేశాలలో నటించి నేడు మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. ఇలా మెగాస్టార్ గాపేరు సంపాదించుకున్న తర్వాత కూడా మీరు వాల్తేరు వీరయ్య సినిమాలో మైనస్ 8 డిగ్రీల చలిలో షూటింగ్ చేశారు.

ఇప్పుడు ఇంత రిస్క్ చేయడం అవసరమా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెబుతూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు ఒక పాత్రకు కమిట్ అయినప్పుడు 100% ఆ పాత్రకు న్యాయం చేయాలి. అక్కడ ఉన్న ఇబ్బందులను ఎప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు ఒకవేళ ఇబ్బందిగా ఫీలైన బయటకు కనపడకుండావాటికి తలవంచి

మనం ఆ పాత్రలను చేసినప్పుడే మనకు ఇండస్ట్రీలో ఉండే అర్హత ఉంటుంది అలా చేయలేనప్పుడు మనం రిటైడ్ అయ్యి ఇంటి దగ్గర కూర్చోవడం ఎంతో మంచిది. ఒక యాక్టర్ గా నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నప్పుడు మీ దగ్గర నుంచి ఇలాంటి ప్రశ్న వేయించుకోను అంటూ చిరు కామెంట్ ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus