మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య షూటింగ్‌లో పాల్గొంటానికి సిద్ధమవతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కంప్లీట్ అవగానే వరుసగా రీమేక్ మూవీస్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు చిరంజీవి. ఈ క్రమంలో మళయాళం చిత్రం లూసిఫర్ తెలుగు రీమేక్‌లో చిరు నటించనున్నారు. మోహన్‌లాల్ నటించింన ఈ మూవీ అక్కడ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే తెలుగులో ఈ చిత్రానికి డైరెక్టర్ సెట్ అవడంలేదు. ఇప్పటికే ఈ చిత్రం నుండి మొదట అనుకున్న సాహో ఫేమ్ సుజిత్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన వినాయక్ కూడా దాదాపు తప్పుకున్నట్లే అని తెలుస్తోంది.
తెలుగు నేటివిటీకి తగ్గట్టు స్క్రిప్ట్‌లో ఎన్ని మార్పులు చేసినా, చిరంజీవిని సంతృప్తి పర్చేలా ఉండకపోవడంతో, ఈ ప్రాజెక్ట్ నుండి వినాయక్ కూడా తప్పుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత మరో మాస్ట్ డైరెక్టర్ హరీష్ శంకర్ పేరు వినిపించింది. బాలీవుడ్ మూవీ దబంగ్ మూవీని పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గటు సక్సెస్‌ఫుల్‌గా డీల్ చేసిన హరీష్, లూసిఫర్‌ను కూడా చిరు ఇమేజ్‌కు తగ్గట్టు చెక్కుతాడని సర్వత్రా భావించారు. అయితే తెరవెనుక ఏం జరిగిందో తెలియదు కానీ, ఇప్పుడు హరీష్ ప్లేస్‌లో మరో డైరెక్టర్ ఎంట్రీ ఇస్తున్నాడి టాక్. తమిళ్ హిట్ మూవీ తన్ని ఒరువన్ చిత్రాన్ని తెరకెక్కించి మోహన్ రాజా, లూసిఫర్ మూవీని డైరెక్ట్ చేయనున్నాడే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారాయి.
ముఖ్యంగా అసలు లూసిఫర్ మూవీ మెగాస్టార్‌కు సెట్ అవుతుందా అనే చర్చలు ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్నాయి. ఎందుకంటే మెగాస్టార్ సినిమా అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన వేసే స్టెప్పులు. లూసిఫర్ ఒరిజినల్ వర్షన్‌లో స్క్రిప్ట్‌లో భాగంగా అసలు పాటలకు స్థానమే లేదు. కామెడీ సీన్స్‌కు కూడా చాన్స్ లేదు. అయితే మెగాస్టార్ సినిమాలో పాటలు, కామెడీ లేకపోతే వర్కవుట్ కాదు. అందుకు పలువురు డైరెక్టర్లు డిజైన్ చేసిన కామెడీ పార్ట్ చిరుకు నచ్చడంలేదనే టాక్ ఉంది. మరి ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఎంట్రీ ఇస్తున్న నేపధ్యంలో, చిరంజీవిని ఎలా చూపిస్తాడు అనేది ఆశక్తిగా మారింది.