ప్రేక్షకులు, అభిమానుల మధ్యకు వస్తే.. మనకు కొత్త చిరంజీవి కనిపిస్తాడు అంటుంటారు. ఎందుకంటే ఆయన మాట, చేత అన్నీ డిఫరెంట్‌గా అనిపిస్తాయి. అభిమానులు అంటే తనకు ఎంత ఇష్టమో మాటలతోనే కాకుండా, చేతలతోనూ చూపిస్తారు చిరంజీవి. గతంలో చాలాసార్లు ఇది జరిగింది, ఇప్పుడు మరోసారి అదే జరిగింది. దీంతో ‘మా మెగస్టార్ అందరివాడు’ ఇందుకే అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. ‘గాడ్‌ఫాదర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో జరిగిన కొన్ని విషయాల గురించి ఆనందంగా చర్చించుకుంటున్నారు.
‘గాడ్‌ఫాదర్’ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా ఆలస్యంగా మొదలైంది అని చెప్పాలి. నాలుగు గంటలకుపైగా సాగిన ఈవెంట్‌కు చిరంజీవి చాలా ఆలస్యంగా వచ్చారు. వర్షం, ట్రాఫిక్ తదితర కారణాల వల్ల ఆయన ఆలస్యమయ్యారు. ఈ విషయం అభిమానులకు అర్థమయ్యేలా చెప్పారు చిరంజీవి. అభిమానులు వర్షంలో తడుస్తూ.. తన కోసం కార్యక్రమంలో ఉంటే.. తాను గొడుగుల కింద నిలబడి మాట్లాడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే తన వ్యక్తిగత సిబ్బంది గొడుగు వేస్తున్నా.. వారించారు. అలా అభిమానులతోనే నేను అని చెప్పారు.
ఇక రెండో విషయానికొస్తే.. అక్టోబరు 5న దసరా కానుకగా తెలుగులో మూడు సినిమాలు వస్తున్నాయి. ‘గాడ్‌ఫాదర్’తోపాటు నాగార్జున ‘ఘోస్ట్’, బెల్లంకొండ గణేష్ ‘స్వాతిముత్యం’ కూడా వస్తున్నాయి. చిరంజీవి తన ప్రసంగంలో తన సినిమా గురిచే చెప్పుకోవడం కాకుండా ‘ఘోస్ట్’ గురించి కూడా చెప్పారు. అక్కడితో ఆగిపోకుండా ‘స్వాతిముత్యం’ గురించి కూడా ప్రస్తావించారు. పెద్ద సినిమాలతోపాటు చిన్న సినిమాలు కూడా ఆడితేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది అంటూ తన మనసు మంచితనాన్ని వివరించారు.
వర్షంలో తడుస్తున్నా.. సినిమాలో నటించిన, సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పిలిచి థ్యాంక్స్ చెప్పారు. తొలుత టీమ్ అంతా కాస్త వాన తగలకుండా దూరంగా ఉన్నారు. కానీ చిరంజీవే తడుస్తున్నప్పుడు, మేం ఇలా ఉంటే బాగోదు అనుకున్నారేమో.. అందరూ వర్షంలో చిరంజీవితోపాటు తడిచేశారు. ఇదేకదా ముందుండి నడిపించడం అంటూ… అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!