Chiranjeevi, Sreemukhi: చిరు శ్రీముఖి కాంబో సీన్ వర్కౌట్ అవుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఖుషి సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని నడుము సీన్ ఏ రేంజ్ లో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ తనకు మాత్రమే సొంతమైన ఎక్స్ ప్రెషన్లతో ఆ సీన్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లారు. ఖుషి సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు పవన్ కెరీర్ లోని ప్రత్యేకమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

Click Here To Watch NOW

కథానుసారం సినిమాలో ఈ సన్నివేశం కీలక పాత్ర పోషించింది. అయితే ఈ సన్నివేశాన్ని భోళాశంకర్ సినిమాలో రీమిక్స్ చేయనున్నారని సమాచారం. చిరంజీవి శ్రీముఖి కాంబినేషన్ లో ఈ సీన్ ఉంటుందని శ్రీముఖి నువ్వు నా నడుము చూశావ్ అని చెబితే చిరంజీవి అక్కడ అన్నీ ముడతలేగా అని చెబుతారని సమాచారం. భోళాశంకర్ సినిమాకు ఈ సీన్ హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది. చిరంజీవి భోళాశంకర్ లో ఎంటర్టైన్మెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా విషయంలో చిరంజీవి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. భోళా శంకర్ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మెహర్ రమేష్ కు దర్శకునిగా ఈ సినిమా సక్సెస్ కీలకమని చెప్పవచ్చు. మెహర్ రమేష్ సినీ కెరీర్ లో హిట్టైన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి.

చిరంజీవి సైతం కథ విషయంలో సంతృప్తి చెందిన తర్వాతే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని బోగట్టా. సినిమాలో చిరు శ్రీముఖి కాంబో సీన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus