మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం తన కెరీర్‌లో పవర్ఫుల్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. విశ్వంభర షూటింగ్ ముగింపుదశలో ఉండగా, ఆ తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారని టాక్. అయితే, మెగా ఫ్యాన్స్‌ను అసలైన ఉత్సాహంలోకి నెట్టిన ప్రాజెక్ట్, శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో, నాని (Nani) సమర్పణలో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్. ఈ సినిమా గురించి అనేక ఊహాగానాలు ఉండగా, తాజాగా నాని ఇచ్చిన క్లారిటీతో ఆ అనుమానాలన్నీ తీరిపోయాయి.
ఇటీవల ‘కోర్ట్’ (Court) మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నాని ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు, చిరు – ఓదెల మూవీ గురించి అడిగినప్పుడు ఆయన “నెక్స్ట్ ఇయర్ ఉంటుంది” అని స్పష్టంగా తెలిపారు. ఈ ఒక్క మాటతోనే చిరు అభిమానులు ఉత్సాహంలో మునిగిపోయారు. గతంలో వచ్చిన ప్రీ లుక్ పోస్టర్‌లో చిరు చేతికి రక్తం కారుతున్న దృశ్యం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. “హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కున్నాడు” అనే క్యాప్షన్ చూస్తే, చిరు కెరీర్‌లో ఇంతవరకు చూడని వైలెంట్ రోల్‌లో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది.
అసలు, ఈ ప్రాజెక్ట్ ముందుగా బాబీ ప్రాజెక్టు తర్వాత సెట్స్ పైకి వెళ్తుందని భావించారు. కానీ అనిల్ రావిపూడి సినిమాను మొదటగా ప్లాన్ చేశారు. ఆ సినిమా పూర్తి చేసిన వెంటనే శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని ఇప్పుడు నాని క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో 2026 చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కూడా త్వరగా పూర్తి అవుతుందని, ఆ తర్వాత చిరు ప్రాజెక్ట్‌ను పూర్తి వేగంగా ఫినిష్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. చిరు సైతం ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారని టాక్.