మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే చాలా దానాలు చేశారు. కానీ అవేవీ బయటకు రాలేదు. కానీ ఈ మధ్య చాలా మంది వాటికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ చిరు గొప్పదనాన్ని వెల్లడిస్తున్నారు. సుమారు ముప్పై కోట్ల ఖర్చుతో చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ సరఫరా కోసం బ్యాంక్ లు మొదలుపెట్టారు. ఇలాంటి గొప్ప ప్రయత్నాన్ని ఏ ప్రజా ప్రతినిధి గుర్తించలేదు. కానీ మెగా క్యాంప్ మాత్రం ఈ విషయంలో పబ్లిసిటీ ఓ రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నారు.
తను చేస్తున్న దానాలు తనే చెబితే బాగోదని.. కొత్త ట్విట్టర్ హ్యాడిల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ లు ఇస్తున్నారు. మెగాస్టార్ కి వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి కౌంటర్ ప్రచారం షురూ చేశారు. మెగాభిమానులు కూడా ఆక్సిజన్ బ్యాంక్ లకు రావాల్సిన ప్రచారం రాలేదని ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ ప్రయత్నాన్ని ప్రశంసించడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మెగాస్టార్ చిరంజీకి కూడా ప్రచారాన్ని కోరుకుంటున్నట్లు కనిపిస్తుంది.
ప్రతిరోజు మెగాస్టార్ కు సంబంధించిన కంటెంట్ వాట్సాప్ లో సర్క్యులేట్ అయ్యేలా చూస్తున్నారు. మరోపక్క జనాలకు సేవలు చేస్తున్న సోనూసూద్ కూడా తన ప్రచారానికి ఎక్కడికక్కడ జనాలను నియమించుకున్నారు. తెలుగు మీడియాలో ఆయన పనులు ప్రచారానికి ఒకరిద్దరు పీఆర్ లను కూడా ఎరేంజ్ చేసుకున్నాడు. అలానే సింగర్ స్మిత కోవిడ్ సహాయ కార్యక్రమాలను రెండు న్యూస్ ఛానెల్స్ గట్టిగా కవర్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ కోవిడ్ సహాయ కార్యక్రమాలు వాటి ప్రచారాలు ఓ రేంజ్ లో సాగుతున్నాయి.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!