మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో భారీ కలెక్షన్స్ వచ్చాయి. దాదాపు రూ.200 కోట్లకు మించి ఈ సినిమా కలెక్షన్స్ ను సాధించింది. ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా రామ్ చరణ్ కి సంబంధించిన సినిమాల్లో చిరంజీవి ఇన్వాల్వ్ అవుతూ.. స్క్రిప్ట్స్ వింటూ వస్తున్నారు. కొంతమంది దర్శకులకు చరణ్ కోసం ప్రత్యేకంగా కథలు సిద్ధం చేయమని చెబుతున్నారట. చరణ్ సినిమాలతో పాటు పెద్ద కూతురు సుష్మిత నిర్మాతగా చేస్తోన్న పలు ప్రాజెక్ట్స్ విషయంలోనూ..
చిరు సూచనలు ఇస్తుంటారు. చిరంజీవి కూతురు సుష్మిత తన భర్తతో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఓ ప్రొడక్షన్ కంపెనీని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ లో తొలి ప్రయత్నంగా శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లతో ‘షూటౌట్ ఎట్ ఆలేర్’ అనే సిరీస్ ను నిర్మించింది. ఈ సిరీస్ పెద్దగా ప్రభావాన్ని చూపించకపోవడంతో నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో ‘సేనాపతి’ని నిర్మించి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. దీనికి ప్రముఖుల ప్రశంసలు దక్కాయి.
కానీ నిర్మాతగా సుష్మితకి చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ప్రస్తుతం సుష్మిత తన బ్యానర్ పై సంతోష్ శోభన్ హీరోగా గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాను రూపొందించారు. అదే ‘శ్రీదేవి శోభన్ బాబు’. ఈ సినిమాతో ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా విషయంలో చిరు ఎలాంటి సపోర్ట్ చేయడం లేదనిపిస్తుంది. చిన్న సినిమాలంటే చిరు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు.
కానీ సుష్మిత ప్రాజెక్ట్ కోసం మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి కానీ, రామ్ చరణ్ కానీ వచ్చి ఉంటే మంచి బజ్ వచ్చేది. కానీ అలా జరగలేదు. సుష్మిత ప్రాజెక్ట్స్ కి చిరు ఎందుకు దూరంగా ఉంటున్నారో ఆయనకే తెలియాలి!