“బాహుబలి” షూటింగ్ మొదలైన ఏడాదికి ఒక భాగం, మళ్ళీ రెండేళ్ల విరామం తీసుకొని రెండో భాగం విడుదల చేశారంటే ఒక అర్ధం ఉంది. కానీ.. సినిమా ఎనౌన్స్ చేసి ఇంకో మూడు నెలల్లో సంవత్సరం పూర్తికావస్తుంది. ఇప్పటివరకూ “సైరా నరసింహారెడ్డి” షూటింగ్ కనీసం 10% కూడా పూర్తవ్వలేదు. మూడు నెలల క్రితం మొదలైన రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి, నయనతార, అమితాబ్ బచ్చన్ ల లుక్ టెస్ట్స్ మరియు అమితాబ్ బచ్చన్ సన్నివేశాల చిత్రీకరణకు సరిపోయింది. సురేందర్ రెడ్డి ఇప్పటికీ స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దుతుండడం, ఇంకా మార్పులు కావాలని రచయితలను ఇబ్బందిపెడుతుండడమే ఇందుకు ముఖ్యకారణం అని తెలుస్తోంది.
ఇదే స్పీడ్ తో గనుక సినిమా చేసుకుంటూ వెళితే 2019లో కూడా పూర్తవ్వడం కష్టమేననే వాదనలు వినబడుతున్నాయి. నిజానికి ఈ చిత్రాన్ని 2018 చివర్లో విడుదల చేయాలనుకొన్నారు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల బట్టి అంచనా వేస్తే 2020కి కానీ సినిమా థియేటర్లలోకి వచ్చే దారి కనిపించడం లేదు. ఈలోపు చిరంజీవి మరో సినిమా చేసినా చేసేస్తాడేమో. ఏదేమైనా సురేందర్ రెడ్డి అర్జెంట్ గా షూటింగ్ ప్రోగ్రెస్ ను స్పీడప్ చేయకపోతే సినిమా మీద జనాలకు ఇంట్రెస్ట్ పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.