Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ తో మరో రెండు సాలిడ్ రికార్డ్స్ కొట్టబోతున్న మెగాస్టార్ చిరంజీవి..

కాస్త టైం గ్యాప్ అంతే కానీ.. సరైన సినిమా పడితే తనకు తానే సాటి అని మరోసారి ప్రూవ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.. రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెం : 150’ తర్వాత చిరు నుండి ఫ్యాన్స్, ఆడియన్స్ ఆ రేంజ్ సినిమా ఎక్స్‌పెక్ట్ చేశారు.. ‘వాల్తేరు వీరయ్య’ తో ఆ లోటు తీర్చడమే కాక.. మెగాభిమానులకు సాలిడ్ ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చారు.. చిరు, మాస్ మహారాజా రవితేజ అన్నదమ్ముళ్లుగా..

బాబీ దర్శకత్వంలో.. మైత్రీ మూవీస్ నిర్మించిన భారీ బడ్జెట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘వాల్తేరు వీరయ్య’..శృతి హాసన్ కథానాయిక కాగా.. కేథరిన్ చిరు మరదలిగా కనిపించింది.. ప్రకాష్ రాజ్, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, నాజర్, వెన్నెల కిషోర్, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.. ఆకట్టుకునే కథ, కథనాలు.. హృదయాల్ని హత్తుకునే సెంటిమెంట్, చిరు మార్క్ కామెడీ, మేనరిజమ్స్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ అలరించాయి..

ముఖ్యంగా అన్నదమ్ముళ్ల సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది.. రికార్డ్ స్థాయి వసూళ్లతో మెగాస్టార్ స్టామినా ఏంటనేది మరోసారి బాక్సాఫీస్‌కి రుచి చూపించాడు వీరయ్య.. ఐదవ వారంలోనూ డీసెంట్ ఫిగర్స్ రాబడుతుంది.. ఇప్పటికే వైజాగ్ జగదాంబ థియేటర్‌లో.. 30 రోజుల్లోపే రూ. 1 కోటి పైగా గ్రాస్ వసూలు చేసి (1,13,42,875/-) ‘ఆర్ఆర్ఆర్’ రికార్డ్‌ని బీట్ చేసేసింది.. ఇప్పుడు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మరో రెండు రికార్డులు కొట్టడానికి రెడీ అవుతోంది..

ప్రేక్షకాదరణ వల్ల ‘వాల్తేరు వీరయ్య’ మూవీని మెయిన్ థియేటర్ సంధ్య 35MM లో 50 రోజుల పాటు ప్రదర్శించాలని డిసైడ్ అయ్యారు.. మరో రెండు వారాలకు పైగానే టైం ఉంది కాబట్టి.. వసూళ్ల పరంగా ఓ రికార్డ్.. బాలయ్య ‘అఖండ’ తర్వాత క్రాస్ రోడ్స్‌లో 50 రోజుల పోస్టర్ వేయనున్న సీనియర్ హీరోగా మరో రికార్డ్ ‘వాల్తేరు వీరయ్య’ ఖాతాలో పడనుంది..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus