Chiranjeevi: మరో డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్న చిరు!

మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశారు. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కాబోతోంది. త్వరలోనే ప్రమోషన్లు మొదలుపెడతారు. ఆ పనులు పూర్తయ్యాక ‘బంగార్రాజు’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. చిరు పుట్టినరోజు అంటే ఆగస్టు 22న ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభం కానుంది. చిరు పెద్ద కూతురు సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించబోతున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘బ్రో డాడీ’ కి ఇది రీమేక్ అని టాక్ నడుస్తుంది. ఈ చిత్రంలో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ.. చిరుకి కొడుకు పాత్రలో నటించబోతున్నట్టు టాక్ నడుస్తుంది. అతని డేట్స్ వర్కౌట్ అవ్వకపోతే ‘ఆర్.ఎక్స్.100 ‘ కార్తికేయ నటించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి పాస్ పోర్ట్ ఆఫీస్ లో ప‌ని చేసే ఎంప్లాయిగా క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది.

ఇలాంటి పాత్ర చిరు (Chiranjeevi) గతంలో చేయలేదు.ఇలాంటి డిఫరెంట్ రోల్స్ నే చిరు ఈ మధ్య ఎంపిక చేసుకుంటున్నారు. చిరుకి జోడీగా త్రిష హీరోయిన్ గా నటించబోతుంది.గతంలో వీరి కాంబోలో ‘స్టాలిన్’ అనే సినిమా వచ్చింది. సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ సరసన శ్రీ‌లీల‌ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది. దాని పై క్లారిటీ రావాల్సి ఉంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus