‘మైత్రి’ బ్యానర్లో ‘భీష్మ’ కాంబో రిపీట్..!

2015 కి ముందు వరకు అగ్ర నిర్మాణ సంస్థలు అంటే ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్'(దిల్ రాజు), ‘గీతా ఆర్ట్స్'(అల్లు అరవింద్), ‘సురేష్ ప్రొడక్షన్స్'(సురేష్ బాబు) బ్యానర్ల పేర్లే వినిపించేవి. అయితే ‘శ్రీమంతుడు’ ‘జనతా గ్యారేజ్’ ‘రంగస్థలం’ వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ తో ఒక్కసారిగా రాకెట్ లా దూసుకొచ్చింది ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ. అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ టాప్ బ్యానర్స్ లో ఒకటిగా నిలదొక్కుకుంది. స్టార్ హీరోలందరూ ‘మైత్రి’ వారితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

అలాగే అగ్ర హీరోలు,ద‌ర్శ‌కులు, హీరోయిన్లంద‌రికీ ‘మైత్రీ’ వారు అడ్వాన్సులు ఇచ్చి లాక్ చేస్తున్నారు. చిరు, బాలయ్య, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్లతో పాటు విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్ వంటి మిడ్ రేంజ్ హీరోలు ఇలా అందరూ ‘మైత్రి’ లోనే సినిమాలు చేస్తున్నారు. ఆఖరికి విజయ్, సల్మాన్ ఖాన్ వంటి పక్క భాషల్లోని స్టార్ హీరోలను కూడా లాక్ చేసేసింది మైత్రి. ఇప్పుడు మరో మిడ్ రేంజ్ హీరో నితిన్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తుంది.

‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్లో నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి వెంకీ కుడుముల దర్శకుడు. గతంలో నితిన్ తో ఇతను ‘భీష్మ’ అనే మూవీ సూపర్ హిట్ మూవీ తీశాడు. తర్వాత చిరంజీవితో మూవీ చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ‘విక్రమ్’ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నప్పుడు కూడా చిరంజీవితో సినిమా చేస్తున్నట్టు ధీమాగా చెప్పుకొచ్చాడు వెంకీ కుడుముల. కానీ చిరుతో మూవీ ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు.

మరోపక్క చిరు కూడా ‘భోళా శంకర్’ ‘ వాల్తేరు వీరయ్య’ వంటి సినిమాల షూటింగ్లలో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. కాబట్టి.. అప్పటి వరకు వెంకీ ఖాళీగా ఉండలేడు కాబట్టి నితిన్ తో మరో సినిమా సెట్ చేసుకున్నాడు వెంకీ. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus