Bhola Shankar: ‘భోళా శంకర్’ రిలీజ్ డేట్‌లో ఈ విషయాలు గమనించారా!..

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఫుల్ ఎనర్జీతో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతున్నారు.. 65 ఏళ్లు దాటినా యంగ్ హీరోలకు పోటీనిస్తూ, తనకు తానే సాటి అంటూ దూసుకెళ్తున్నారు.. గతేడాది ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ విడుదల చేసి.. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ గా బ్లాక్ బస్టర్ కొట్టారు.. ప్రస్తుతం ‘భోళా శంకర్’ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.. ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుగుతోంది.. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా..

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.. మిల్కీ బ్యూటీ తమన్నా రెండోసారి జత కడుతుండగా.. కీర్తి సురేష్ చెల్లెలిగా, యంగ్ హీరో సుశాంత్ ఆమె భర్తగా కనిపించనున్నాడు.. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి పెద్ద పీట వేస్తూ.. సెంటిమెంట్, చిరు మార్క్ యాక్షన్, మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో.. భారీ బడ్జెట్‌తో అంచనాలకు మించేలా తెరకెక్కిస్తున్నారు..తెలుగు సంవత్సరాది సందర్భంగా తెలుగు ప్రజలకు, ప్రేక్షకాభిమానులకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు టీమ్..

ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల చేయనున్నారు.. ఆగస్టు 22న చిరు పుట్టినరోజు.. సరిగ్గా 11 రోజుల ముందు 11వ తేదీన చిత్రం రానుండడం విశేషం.. రిలీజ్ డేట్ పోస్టర్‌లో మెగాస్టార్, కీర్తి సురేష్, తమన్నాల లుక్ బాగుంది.. చిరు సింపుల్ అండ్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.. ఇందులో అదిరిపోయే ఐటెమ్ సాంగ్ ఒకటి ప్లాన్ చేశారట..

చిరు ఫ్యాన్స్, ఆడియన్స్‌కి సాలిడ్ సర్‌ప్రైజ్ ఇచ్చేలా ఆ సాంగ్ ప్లాన్ చేయబోతున్నారట.. బాలీవుడ్ భామ మలైకా అరోరా ఈ సాంగ్‌లో చిరు పక్కన చిందులెయ్యనుందట.. చిరు కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మెమరబుల్ ఫిలింగా నిలిచిపోయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘చూడాలని ఉంది’ కథ కూడా కలకత్తాలోనే జరుగుతోంది.. ఇందులోనూ అదే ప్లేస్, బ్యాక్ డ్రాప్ కావడం అనేది సెంటిమెంట్‌గా కలిసి రావడమే కాక.. దానిలాగే ఇది కూడా కచ్చితంగా విజయం సాధిస్తుందనే ధీమాతో ఉన్నారు చిరు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus