Chiranjeevi: ఇన్నేళ్ళ కెరీర్లో చిరు లిప్ లాక్ చేసింది ఆ సినిమాలోనే..!

చిరంజీవి… ఈ పేరు గురించి కొత్త చెప్పడానికి ఏముంది. తన స్వయంకృషి, పట్టుదల, సంకల్పంతో సామాన్యుడి నుంచి మెగాస్టార్ ఎదిగారు చిరు. జానపదాలు, పౌరాణీకాలతో కొట్టుకుపోతున్న తెలుగు చిత్ర సీమను మలుపు తిప్పిన వ్యక్తి. తన బ్రేక్ డ్యాన్సులు, ఫైట్స్, పంచ్ డైలాగ్‌లతో ఎన్టీఆర్ తర్వాత తెలుగు సినీ ప్రపంచాన్ని మకుటం లేని మహారాజులాగా పాలించాడు మెగాస్టార్. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి వుండే గొప్ప లక్షణం ఆయన సొంతం. తనను ఇంత వాడిని చేసిన సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లు పెట్టి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టారు చిరు.

ఇక గతేడాది కోవిడ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా ఎందరికో ఊపిరి పోశారు . 70కు దగ్గరవుతున్నా ఇంకా అదే ఉత్సాహంతో, తగ్గని ఛార్మింగ్‌తో కుర్రాళ్లకు పోటీనిస్తున్నారు మెగాస్టార్.ఆయన కెరీర్‌లో ఎందరో హీరోయిన్లతో జతకట్టారు చిరు. వీరిలో హిట్ పెయిర్ అనిపించుకున్న వాళ్లు కూడా వున్నారు. అయితే ఏనాడూ హీరోయిన్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం గానీ, శృతిమించడం గానీ లేదు. అందుకే ఆయనతో పని చేసిన అలనాటి హీరోయిన్లకు ఇప్పటికీ చిరు అంటే ఎంతో ఇష్టం. అయితే లిప్‌లాక్ సీన్లకి ఆమడ దూరంలో ఉండే మెగాస్టార్.. ఓ సినిమాలో మాత్రం తప్పని పరిస్ధితుల్లో హీరోయిన్‌తో లిప్‌లాక్ సీన్‌లో న‌టించాల్సి వ‌చ్చింది. అదే ‘ఘ‌రానా మొగుడు’.

చిరంజీవి, రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఈ మూవీ ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపింది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా చిరంజీవిని నిలబెట్టింది ఈ చిత్రమే. ఈ సినిమాలో ‘‘ పండు పండు ’’.. అనే పాట‌లో హీరోయిన్ న‌గ్మాతో చిరు లిప్‌లాక్ చేయాల్సి ఉంటుంది. మెగాస్టార్ నా వల్ల కాదు బాబోయ్ అని చెప్పినా డైరెక్టర్ రాఘవేంద్రరావు మాత్రం చేయాల్సిందే అని పట్టుపట్టి మరీ చిరుని ఆ లిప్ లాక్ సీన్‌లో చేయించారు. కానీ ఆ రోజంతా ఏదో వెలితిగా, బాధగా అనిపించడంతో వెంటనే మ‌ద్రాసుకు వ‌చ్చి ఎడిటింగ్ ల్యాబ్‌లో ఆ లిప్‌లాక్ సీన్‌ను ఎడిట్ చేయించేశారట చిరు. అందుకే ఆ పాటలో ఆ లిప్ లాక్ సీన్ ఎక్కడా కనిపించదు. సో.. అది చిరు అంటే.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus