డ్యాన్స్ జీన్స్‌ లోనే ఉంది.. మెగాస్టార్ మనవరాలా.. మజాకా.. వీడియో వైరల్..!

  • December 12, 2022 / 03:02 PM IST

ఈమధ్య ఎక్కడ విన్నా.. ‘ బాసూ వేర్ ఈజ్ ద పార్టీ’ సాంగే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ లో ఫస్ట్ సింగిల్ ఇది.. ఒక్క పాటతోనే ఊపు ఊపుతున్నారు చిరు.. లిరికల్ వీడియోనే ఇలా ఉందంటే.. ఇక థియేటర్లలో రచ్చ రంబోలానే.. సంక్రాంతి కానుకగా జనవరి 13న మూహూర్తం ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే.. చిరు ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ వెళ్లారు.. విహార యాత్రతో పాటు పని కూడా అంటూ ఒక పోస్టుతోనే హింట్ ఇచ్చారు..

ప్రస్తుతం ఫ్రాన్స్‌లో చిరు, శృతి హాసన్ మీద ఓ పాట షూట్ చేస్తున్నారు.. తర్వాత టీం ఇండియా తిరిగొచ్చేస్తారని సమాచారం.. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల గారాల పట్టి.. మెగా మనవరాలు.. తాత గారి ‘బాస్ పార్టీ’ పాటకి కాలు కదిపింది.. వణికించే చలిలో.. శేఖర్ మాస్టర్‌తో కలిసి తను వేసిన ముద్దు ముద్దు మూమెంట్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.. ‘‘డ్యాన్స్ వారి జీన్స్‌లోనే ఉంది.. మెగాస్టార్ మనవరాలా.. మజాకా’’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు..సుస్మిత ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అవుతోంది..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus