కవి ఫిల్మ్ సిటీ సమర్పణలో, శ్రీ క్రియేషన్స్ పతాకం పై బండారు దానయ్య కవి దర్శకత్వంలో పుప్పాల శ్రీధర్ రావు నిర్మిస్తున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ “చిత్రపటం”. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెలాఖరుకు విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ”సమాజంలోని మనుషుల ఆప్యాయత ,అనురాగాలను ,వారి భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిది.వినసొంపైన సంగీతం,ఆకట్టుకునే కెమెరా అందాల మేళవింపుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కోట శ్రీనివాసరావు వంటి సీనియర్ ఆర్టిస్టులు ఈ చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను.అలాగే ఇటీవలె విడుదలైన పాటలకు జూక్ బాక్స్ లో మిలియన్ వ్యూస్ దాటి రావడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు ఇంకా చేరువ అవ్వాలనే ఉద్దేశంతో రేడియోమిర్చి వారి సహకారం తో చిత్రపటం పాటల కాంటెస్ట్ నిర్వహించి ,వినాయక చవితికి విన్ అయిన శ్రోతలకు ఎలక్ట్రానిక్ బైక్ లను బహుమతి ప్రదానం చేయనున్నాం.అలాగే సినిమాను ఈ నెలాఖరుకు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.”అన్నారు
కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళీ,తమిళ్ నరేన్, శరణ్య పొన్నవాన్,కాలకేయ ప్రభాకర్, బాలచారి, పార్వతీశం, శ్రీవల్లి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి:మురళీమోహన్ రెడ్డి,ఎడిటర్:వినోద్అద్వయ్,పీ అర్ ఓ:బి. ఎస్. వీరబాబు, నిర్మాత:పుప్పాల శ్రీధర్ రావు, కధ, మ్యూజిక్,లిరిక్స్, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం:బండారు దానయ్య కవి.