కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన పెను విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసిందనే సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 277కు చేరిందనే సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి విక్రమ్ (Chiyaan Vikram) విచారం వ్యక్తం చేశారు. తన వంతుగా విక్రమ్ 20 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటన చూసి కేరళపై ప్రకృతి పగబట్టిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొండచరియలు విరిగి పడి దాదాపుగా 280 మంది చనిపోవడం సాధారణమైన విషయం కాదని చెప్పవచ్చు.
విక్రమ్ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాన్ని ప్రకటించడం జరిగింది. విక్రమ్ మేనేజర్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. విక్రమ్ నటించిన తంగలాన్ మూవీ ఈ నెల 15వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు పోటీగా తెలుగులో మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. వయనాడ్ బాధితులకు విరాళం ప్రకటించిన విక్రమ్ మనస్సు మంచి మనస్సు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సూర్య (Suriya) దంపతులు కూడా భారీ మొత్తంలో విరాళం ప్రకటించారని వార్తలు వస్తున్నాయి.
మరి కొందరు సెలబ్రిటీలు సైతం సీఎం సహాయనిధికి తమ వంతు సహాయం ప్రకటిస్తే బాగుంటుందని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సెలబ్రిటీలు విరాళం ప్రకటిస్తారేమో చూడాలి. తంగలాన్ సినిమాకు పా రంజిత్ (Pa. Ranjith) దర్శకుడు కాగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. తంగలాన్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమాకు లాంగ్ రన్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.
తంగలాన్ (Thangalaan) సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. విక్రమ్ ఈ సినిమా కోసం పడిన కష్టం అంతాఇంతా కాదు. విక్రమ్ భవిష్యత్తు ప్రాజెక్ట్స్ సైతం భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. విక్రమ్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని ఆ ప్రాజెక్ట్స్ ఒకింత భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది.