క్రిస్మస్ బాక్సాఫీస్.. వేస్ట్ అయినట్లేనా?

ప్రతీ ఏడాది పండుగ సీజన్ అంటే సినిమాల సందడే. కానీ ఈ ఏడాది క్రిస్మస్ సినిమాల పరిస్థితి మాత్రం ఆశించిన విధంగా లేదు. భారీ అంచనాలతో విడుదల అవుతాయని అనుకున్న పలు సినిమాలు చివరి నిమిషంలో వాయిదా పడటంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. నాగచైతన్య (Naga Chaitanya)  ప్రధాన పాత్రలో తెరకెక్కిన “తండేల్,” (Thandel) నితిన్(Nithiin)  “రాబిన్ హుడ్” (Robinhood) వంటి క్రేజీ ప్రాజెక్టులు క్రిస్మస్ సందర్భంగా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల 2025కి వాయిదా పడ్డాయి.

Movie

దీంతో ఈసారి క్రిస్మస్ సీజన్ బాక్సాఫీస్ మీద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన “బచ్చల మల్లి” (Bachhala Malli) మంచి అంచనాలతో విడుదలైనప్పటికీ, ఆడియన్స్‌ను ఆశించినంతగా మెప్పించలేకపోయింది. “సీక్వెల్ విడుదల-2,” (Vidudala Part 2) “ముఫాసా” వంటి డబ్బింగ్ చిత్రాలు కూడా పెద్దగా గుర్తింపు పొందలేదు. కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra Rao)  నటించిన “యూఐ” ( UI The Movie)  ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువెళ్లినా, సినిమా కంటెంట్ నెగటివ్ టాక్ తెచ్చుకుంది.

క్రిస్మస్ రోజున మూడు సినిమాలు విడుదలయ్యాయి. వెన్నెల కిషోర్ (Vennela Kishore) ప్రధాన పాత్రలో నటించిన “శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్” (Sreekakulam Sherlock Holmes) ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ చిత్రానికి ముందు బజ్ ఉండటం, రివ్యూస్ పాజిటివ్‌గా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నిలుస్తుందని అనిపిస్తోంది. ఇతర రెండు డబ్బింగ్ చిత్రాలు, మోహన్ లాల్ (Mohanlal) నటించిన “బరోజ్” (Barroz) మరియు కిచ్చా సుదీప్ (Sudeep) నటించిన “మ్యాక్స్,” (Max) థియేటర్లలో విడుదలైనప్పటికీ పెద్దగా ఆడియన్స్‌ను ఆకర్షించలేకపోయాయి.

వీటికి విడుదలకు ముందు సరైన ప్రమోషన్స్ లేకపోవడం కారణంగా ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. ఈసారి క్రిస్మస్ బాక్సాఫీస్ ఎటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన ఈ చిత్రాల వల్ల పండుగ సీజన్ వేడుకలు అందంగా సాగలేదనే చెప్పవచ్చు. అయితే “శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్”కు పాజిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతోందని, చివరికి ఈ సినిమా బాక్సాఫీస్‌కి ఊరటను అందించవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

గవర్నమెంట్‌ – టాలీవుడ్‌ మీటింగ్‌… ఈ ప్రశ్నలకు ఆన్సర్‌లు ఎవరిస్తారు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus