Rathnavelu: ‘దేవర’ గురించి కొత్త పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన రత్నవేలు.. ఏమన్నారంటే?

తారక్‌ (Jr NTR)  – కొరటాల శివ  (Koratala Siva) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దేవర: పార్ట్‌ 1’ (Devara) విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో రోజుకో కొత్త పుకారు బయటకు వస్తోంది. సినిమా గురించి ఒక్కొక్కరు ఒక్కో రకం మాట చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు ఛాయాగ్రాహకుడిగా పని చేసిన రత్నవేలు (R. Rathnavelu) కొన్ని కామెంట్స్‌ చేశారు. ఆ పుకార్లను నమ్మెద్దు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఏమైందంటే? ‘దేవర’ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రెండు ట్రైలర్లు వచ్చాయి.

Rathnavelu

తొలి ట్రైలర్‌లో మిస్ అయిన కొన్ని అంశాలను రెండో ట్రైలర్‌లో పొందుపరిచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొత్త ట్రైలర్‌ చూసిన అభిమానులు, నెటిజన్లు.. ఈ సినిమాలో తారక్‌ ట్రిపుల్‌ రోల్‌లో కనిపించనున్నాడు అంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపైనే తాజాగా సినిమాటోగ్రాఫర్‌ స్పందించారు. ‘దేవర’ సినిమాపై చాలా ఊహాగానాలు వస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్నాయి కూడా. యూట్యూబ్‌ చానళ్ల గురించి మనకు తెలిసిందే కదా. వాళ్లు ఏది కావాలంటే అది చెప్పగలరు.

ఇక ఈ సినిమాలో తారక్‌ ట్రిపుల్‌ రోల్‌లో కనిపించడం లేదు. ద్విపాత్రాభినయం చేస్తున్నారంతే. అయితే తండ్రీకొడుకులుగా నటిస్తున్నారా.. అన్నదమ్ములా అనేది సినిమాలో చూడండి అని రత్నవేలు చెప్పారు. ఇక ఈ సినిమా తెలుగు ప్రచారం అసంపూర్తిగా ముగిసింది. మరోవైపు ముందుగా అనుకున్న ప్లానింగ్‌ ప్రచారం ఎన్టీఆర్‌ అమెరికా వెళ్లిపోయాడు. లాస్‌ ఏంజిలెస్‌లో జరగనున్న బియాండ్‌ ఫెస్ట్‌ కోసం తారక్‌ అక్కడికి వెళ్లాడు. ఆ ఈవెంట్‌లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ నెల 26న అమెరికాలోని ప్రఖ్యాత ఈజిప్షియన్‌ థియేటర్‌లో ‘దేవర’ ప్రదర్శించనున్నారు. మరోవైపు ఇప్పటికే వివిధ రికార్డులు సొంతం చేసుకున్న ‘దేవర’ ఓవర్సీస్‌లో ప్రీసేల్‌ టికెట్‌ బుకింగ్స్‌లో హవా చూపించాడు. ప్రీసేల్‌ బుకింగ్స్‌లో అత్యంత రెండు మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. రిలీజ్‌కు ఇంకా మూడు రోజులు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. సినిమా వచ్చాక టాక్‌ కలిసొస్తే ఇక ఉప్పెనే.

‘హరి హర వీరమల్లు’.. ఇది ఎన్నో రిలీజ్‌ డేటో తెలుసా? గతంలో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus