మాస్ మహారాజా రవితేజ నటించిన ‘మాస్ జాతర’ సినిమా వాస్తవానికి జూలై 18న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆగస్టు 27కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ డేట్ కి కూడా సినిమా రావడం లేదు అనే టాక్ అయితే రన్ అవుతుంది. ఈ క్రమంలో కొన్ని మీడియా సోర్సులు ఎట్టి పరిస్థితుల్లోనూ ‘మాస్ జాతర’ ఆగస్టు 27నే రిలీజ్ అవుతుంది అని… నిర్మాత నాగవంశీ డిస్ట్రిబ్యూటర్స్ కి చెప్పినట్టు ప్రచారం చేస్తున్నాయి. మరోపక్క డిస్ట్రిబ్యూటర్స్ ను అడిగితే ‘మాస్ జాతర’ ఆగస్టు 27 నుండి వాయిదా పడినట్టే చెబుతున్నారు.
మిగతా విషయాలు ఏమీ నిర్మాత చెప్పలేదు అని అంటున్నారు. మరోపక్క ‘మాస్ జాతర’ షూటింగ్లో భాగంగా ఇంకో పాట చిత్రీకరించాల్సి ఉందట. ఫెడరేషన్ సభ్యుల సమ్మె కారణంగా అది షూట్ చేయలేకపోయారు. అలాంటప్పుడు ‘మాస్ జాతర’ రిలీజ్ ఆగస్టు 27 కి ఎలా సాధ్యం? మరోపక్క నిర్మాత నాగవంశీ ‘కింగ్డమ్’ ‘వార్ 2’ సినిమాల వల్ల నష్టాల్లో ఉన్నారు. అదెలా ఉన్నా.. ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన కామెంట్స్ కి నెక్స్ట్ లెవెల్ ట్రోలింగ్ జరిగింది.
సో ఇప్పట్లో ఆయన మీడియా ముందుకు రావడం చాలా కష్టం అనే చెప్పాలి. సో ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ ‘మాస్ జాతర’ ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. సో ముందుగా ఆ బ్యాలెన్స్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసి, ఆ తర్వాత ప్రమోషన్స్ జరిపి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి. ఈ సినిమా సక్సెస్ రవితేజ, హీరోయిన్ శ్రీలీలకి మాత్రమే కాదు ఇప్పుడు నిర్మాత నాగవంశీకి కూడా చాలా ముఖ్యం.