Brahmastra: ఎన్టీఆర్ పై ఆగ్రహంతోనే కేసీఆర్ ఇంత పని చేశారా… నిజం ఎంత?

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా తెలుగులో రాజమౌళి సమర్పణలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సెప్టెంబర్ రెండవ తేదీ రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు.

ఇక ఈ కార్యక్రమం ఏర్పాటు కోసం అన్ని సిద్ధం చేసుకున్న చివరి నిమిషంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు ఈ కార్యక్రమానికి బందోబస్తు నిర్వహించలేమని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితులలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.అయితే ఇలా ఈ కార్యక్రమం రద్దు కావడంతో ఎంతోమంది ఎన్టీఆర్ అభిమానులు ఈ కార్యక్రమం రద్దు కావడం వెనుక కేసీఆర్ హస్తము ఉందంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్న విషయం మనకు తెలిసిందే

అయితే ఎన్టీఆర్ గత వారం రోజుల క్రితం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీని విస్తరించడం కోసమే ఇలా సినీ హీరోలతో బీజేపీ ప్రభుత్వం మంతనాలు జరుపుతుందని తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వాన్ని బలహీనపరచడం కోసమే ఇలా అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విధంగా అమిత్ షా ఎన్టీఆర్ భేటీ కావడంతో ఎన్టీఆర్ పట్ల కెసిఆర్ ఆగ్రహంతో ఉన్నారని

అందుకే ఈ వేడుక రద్దు కావడం వెనుక కేసీఆర్ హస్తం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు వైరల్ కావడంతో మరి కొంతమంది సినిమాలకు రాజకీయాలకు ఇలా పొంతన పెట్టద్దని,గణేష్ ఉత్సవాల నిమిత్తమే బందోబస్తు కారణంగానే ఈ వేడుక వాయిదా పడింది అంటూ పలువురు ఈ విషయంపై స్పందించారు.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus