చియాన్ విక్రమ్ హీరోగా ‘డిమోటీ కాలనీ’ ‘అంజలి సి.బి.ఐ’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన చిత్రం ‘కోబ్రా’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సెవెన్ స్క్రీన్ స్టూడియోస్’ బ్యానర్ పై ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ ‘ఎన్వీఆర్ సినిమా’ ద్వారా విడుదల చేస్తున్నారు. ‘కె.జి.ఎఫ్'(సిరీస్) హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడం..
ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడంతో సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో ‘కోబ్రా’ పై అంచనాలు పెరిగాయి.కానీ మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి రోజు మంచి కలెక్షన్లు రాబట్టింది.కానీ రెండో రోజు నుండి తగ్గిపోయాయి.వీక్ డేస్ లో ఈ మూవీ రాణించలేకపోయింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 1.18 cr |
సీడెడ్ | 0.43 cr |
ఉత్తరాంధ్ర | 0.65 cr |
ఈస్ట్ | 0.36 cr |
వెస్ట్ | 0.33 cr |
గుంటూరు | 0.31 cr |
కృష్ణా | 0.34 cr |
నెల్లూరు | 0.18 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.78 cr |
‘కోబ్రా’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటి వారం పూర్తయ్యే సరికి ఈ చిత్రం రూ.3.78 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.0.72 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
మొదటి రోజున బాగా కలెక్ట్ చేసిన ఈ మూవీ రెండో రోజు నుండి డౌన్ అయిపోయింది.వీకెండ్ వరకు కూడా కొంత వరకు పర్వాలేదు అనిపించగా నిన్న మొదటి సోమవారం నుండీ రాణించలేకపోతుంది.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!