మెగాస్టార్ చిరంజీవి 65 ఏళ్ళ వయసులో కూడా స్టార్ డం ను మెయింటైన్ చేస్తున్నారు అంటే.. దానికి ప్రధాన కారణం ఆయన జడ్జిమెంట్ అనే చెప్పాలి. ఎటువంటి సినిమా చేసినా.. అందులో తన అభిమానులను ఆకర్షించే ఎలిమెంట్స్ ను ఉండేలా జాగ్రత్త పడుతుండడం మెగాస్టార్ కు మొదటినుండీ అలవాటు. అందుకే ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నా.. స్క్రిప్ట్ విషయంలో అన్నీ పక్కాగా ఉంటేనే ముందుకు వెళ్తుంటారు. ఇక సినిమా పూర్తయ్యాక ఎడిటింగ్ రూమ్లో డైరెక్టర్ తో కూర్చొని రిపేర్లు చెయ్యడం ఎలాగూ ఉంటుంది.
అది తన చేస్తున్న సినిమాలకు మాత్రమే కాదు తన తనయుడు చరణ్ చేస్తున్న సినిమాలకు కూడా..! ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల మిత్రుడు నిరంజన్ రెడ్డి నిర్మాత. చరణ్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు లెండి..! అయితే దర్శకుడు కొరటాల శివ తాను తెరకెక్కించే ప్రతీ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. బడ్జెట్, క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడడు.
అంతేకాకుండా హీరో ఇన్వాల్వ్మెంట్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. ఇప్పుడు ఇదే చిరుని ఇబ్బంది పెడుతుందని ఇన్సైడ్ టాక్. చెప్పాలంటే అగ్ర దర్శకులు ఎవరితో సినిమాలు చేసినా ఇదే పద్ధతి ఫాలో అవ్వాలి. అందుకే ఆయన తరువాతి సినిమాలకు మెహర్ రమేష్, బాబీ వంటి డైరెక్టర్లను ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అప్పుడు చిరుకి కావాల్సింది కంఫర్ట్ గా అడిగి చేయించుకోవచ్చు.