మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘భోళా శంకర్’ విడుదలైన మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నుండి ఇంత బి గ్రేడ్ సినిమా వస్తుందని మేము ఊహించలేదు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి నుండి ఇలాంటి ఔట్పుట్ ని అసలు ఎప్పుడూ చూడలేదని, ఫామ్ లో లేని మెహర్ రమేష్ లాంటి దర్శకుడికి యంగ్ హీరోలు కూడా అవకాశాలు ఇవ్వరు.
అలాంటిది మెగాస్టార్ ఎలా ఇచ్చాడో అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి నిర్మాతగా అనిల్ సుంకర వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది ఆయన ‘ఏజెంట్’ చిత్రం తో భారీ డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకొని నష్టాల్లో ఉన్నాడు. కానీ రీసెంట్ గా విడుదలైన చిన్న సినిమా ‘సామజవరగమనా’ మాత్రం సూపర్ హిట్ గా నిలిచి అనిల్ కి కాస్త నష్టాలను పూడ్చింది.
లాభాల్లోకి అడుగుపెట్టాము అని ఆనందించే లోపే ‘భోళా శంకర్’ రూపం లో మరో డిజాస్టర్ ఫ్లాప్ రావడం బాధాకరం. అయితే కొన్ని పచ్చ వెబ్ సైట్స్ చిరంజీవి తనకి కమిటైన రెమ్యూనరేషన్ ని ఇవ్వాలంటూ నిర్మాత అనిల్ సుంకర పై ఒత్తిడి పెట్టాడని, అనిల్ సుంకర దానిని భరించలేక నగర శివార్లలో తనకి ఉన్న స్థలాలు మరియు ఇల్లు ని తాకట్టు పెట్టి చిరంజీవి కి రెమ్యూనరేషన్ ఇచ్చే ప్రయత్నం లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చెయ్యగా, ఇదంతా కేవలం అసత్య ప్రచారమే అని తేలింది.
నిర్మాత అనిల్ సుంకర కి రెమ్యూనరేషన్స్ ఇవ్వడానికి తన ఆస్తులను కుదవ పెట్టుకోవాల్సిన ఖర్మ ఎప్పుడూ పట్టలేదని, ఆయనకీ ఇండియా లో మరియు ఓవర్సీస్ లో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయని, ఆయన నెల సంపాదన కోట్లలో ఉంటుందని ఆంటున్నారు. ఇకపోతే చిరంజీవి రెమ్యూనరేషన్ తో పాటుగా సినిమా లో పని చేసిన ప్రతీ ఆర్టిస్టుకి సంబంధించిన రెమ్యూనరేషన్ ని రీ రికార్డింగ్ పూర్తైన రోజునే సెట్టిల్మెంట్ చేసేశారని తెలుస్తుంది.